Raja Vikramarka: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దక్కించుకున్న హీరో కార్తికేయ. ఆ తర్వాత వైవిధ్యమైన చిత్రాలతో ఎప్పటికప్పుడు మార్క్‌ను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా, రాజా విక్రమార్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో. నవంబరు12 న ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. అయితే, అక్కడ ప్రేక్షకుల రివ్యూలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం.
హీరో కార్తికేయ- తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన సినిమా రాజా విక్రమార్క. శ్రీ సరిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆదిరెడ్డి సమర్పణలో రమారెడ్డి నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ సినిమాకు సంగీతం అందించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది.
ఫన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన రాజా విక్రమార్క మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమో, ట్రైలర్లు మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. మరోవైపు మెగాస్టార్ లాంటి వారు ఈ సినిమాను ప్రమోట్ చేయడం మరింత హైప్ పెంచింది. సినిమా చూసిన కొంత మంది ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంత మంది సినిమా బాగుందని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు యావరేజ్ అంటూ పోస్ట్ చేస్తున్నారు.
సినిమాలో కార్తికేయ యాక్టింగ్.. కామెడీ సీన్స్ ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ కూడా ఫర్యాలేదనిపిస్తుందని అంటున్నారు. అయితే, థ్రిల్ విషయంలో క్రియేట్ చేసిన ట్విస్టులు, స్లో నరేషన్, ఎడిటింగ్, దర్శకత్వం లోపం, లాజిక్ లేని సీన్స్, ఈ సినిమాకు మైనస్ అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.
ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం హీరోను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా చూపించేందుకు చేసే ప్రయత్నాలు, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, అక్కడక్కడ కామెడీ సీన్స్ ఫర్వాలేదనిపించిందని తెలుస్తోంది. కాగా, సెకండ్ ఆఫ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు. అయితే, ఎప్పటి నుంచి మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న కార్తికేయ ఈ సినిమా నిరాశపరిచినట్లు అనిపిస్తోంది. మరి రాను రానూ ఈ సినిమా టాక్ మారుతుందేమో చూడాలి.