Team India: టీమిండియాకు కొత్త నాయకత్వం రాబోతోంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియాకు నూతన జట్టును నియమించింది. ఇందులో భాగంగా కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియామకం జరిగింది. దీంతో జట్టు కూర్పు కొత్తదనంతో మారడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. విజయాలు సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు.

కోహ్లి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జట్టు పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించింది. టీ 20 జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపికవడంతో టెస్ట్ నిర్వహణపై అనుమానాలున్నాయి. కోహ్లి కెప్టెన్ గా తప్పుకోవడంతో ఎవరికి పగ్గాలు అప్పగించాలనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది.
టీ 20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్, భారత జట్లు రెండు టెస్టుల్లో తలపడనున్నాయి. టీ 20 సిరీస్ కు కోహ్లిని బీసీసీఐ పక్కకు పెట్టింది. దీంతో విరాట్ అందుబాటులో ఉండటం లేదు. ఈ టెస్టులకు ఎవరి ప్రాతినిధ్యం వహిస్తారని ప్రశ్నలు వస్తున్నాయి. అయితే రోహిత్ శర్మకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
2023 వన్డే వరల్డ్ కప్ సాధనలో కోహ్లి విజయం సాధిస్తారా అనేదే అనుమానం. రోహిత్ శర్మ కెప్టెన్ కే బీసీసీఐ అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. టెస్ట్ జట్టు కెప్టెన్ గా కోహ్లిని కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు విజయావకాశాలపై అభిమానుల ఆశలు నెరవేరతాయో లేదో వేచి చూడాల్సిందే.