Pushpaka Vimanam:‘పుష్పక విమానం’ రివ్యూ

Pushpaka Vimanam: తెలుగు సినిమాలో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన తమ్మడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లోకి వచ్చి అలరిస్తున్నాడు. అయితే ఆయన నటించిన రెండు సినిమాలో పెద్దగా ఆడకపోయినా ఆనంద్ నటన మాత్రం ఆకట్టుకుంటోంది. దీంతో ఆయన అవకాశాలు వెల్లువలా వస్తున్నారు. తాజాగా ఆనంద్ నటించిన ‘పుష్పక విమానం’ రిలీజ్ అయింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్ష్ వస్తోంది. అయితే ఆ సినిమా గురించి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. […]

Written By: NARESH, Updated On : November 12, 2021 6:46 pm
Follow us on

Pushpaka Vimanam: తెలుగు సినిమాలో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన తమ్మడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లోకి వచ్చి అలరిస్తున్నాడు. అయితే ఆయన నటించిన రెండు సినిమాలో పెద్దగా ఆడకపోయినా ఆనంద్ నటన మాత్రం ఆకట్టుకుంటోంది. దీంతో ఆయన అవకాశాలు వెల్లువలా వస్తున్నారు. తాజాగా ఆనంద్ నటించిన ‘పుష్పక విమానం’ రిలీజ్ అయింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్ష్ వస్తోంది. అయితే ఆ సినిమా గురించి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

నటీనటులు:
ఆనంద్ దేవరకొండ, గీతా సైనీ, సునీల్, శాన్వి మేఘన.

సాంకేతిక కార్యవర్గం:
డైరెక్టర్- దామోదర్: నిర్మాత- గోవర్దన్ రావు దేవరకొండ, ప్రదీప్, ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి: మ్యూజిక్ డైరెక్టర్ -అమిత్ దాసా, రామ్ మిరియాల.

కథ:
చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) కు మీనాక్షి(గీతా సైనీ) అనే అమ్మాయితో పెళ్లి అవుతుంది. పెళ్లయి వెంటనే ఆ అమ్మాయి వేరొకరితో వెళ్తుంది. దీంతో సుందర్ షాక్ తింటాడు. దీంతో సుందర్ వేరే ఒక అమ్మాయి(శాన్వి మేఘన)ను తీసుకొచ్చి తన భార్యగా లోకాన్ని నమ్మిస్తాడు. అయితే ఈ తరుణంలో సుందర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. సుందర్ పారిపోయిన అమ్మాయి తనతోనే ఉందని చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే సుందర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరితో వెళ్తుంది..? ఎక్కడికి వెళ్తుంది..? ఆ తరువాత జరిగేది స్క్రీన్ పై చూడాల్సిందే.

కథనం:
కామెడీ ప్రధానంగా నడిచే ఈ సినిమాలో సందర్ హైలెట్ గానిలుస్తాడు. ఇటువంటి సినిమాలు ఇదివరకు వచ్చినా కొత్తగా కామెడీతో డైరెక్టర్ దామోదర్ ఆకట్టుకున్నాడు. కథను అనేక మలుపులు తిప్పుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా నవ్వులతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా చాలా రోజుల తరువాత కామెడీ ప్రధానంగా ఓ మూవీ వచ్చిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ఎవరెలా చేశారంటే..?
సుందర్ పాత్రలో ఆనంద్ ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తంలో ఆనంద్ హైలెట్ గా నిలుస్తాడు. ఇక గీత సైనీ తన నటనతో ఆకట్టుకుంటుంది. పోలీస్ అధికారి పాత్రలో సునీల్ తనదైన స్టైల్లో నటించాడు. ఆనంద్ భార్య పాత్రలో శాన్వి నవ్వులు పూయిస్తుంది.

Also Read: ‘రాజా విక్రమార్క’ ఆకట్టుకున్నాడా?.. మూవీ రివ్యూ!

‘తెలంగాణ దేవుడు’ మూవీ రివ్యూ