https://oktelugu.com/

Raja Saab: రాజాసాబ్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..? ప్రభాస్ మారుతి ని లైట్ తీసుకుంటున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్...ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేయడమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ లను కూడా అందుకుంటున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 8, 2024 / 11:30 AM IST

    rajasaab

    Follow us on

    Raja Saab: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోయే సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటూ తన అభిమానులు సోషల్ మీడియా వేదికగా భారీ కామెంట్లైతే చేస్తున్నారు. ఇక దీనికి తగ్గట్టుగానే ప్రస్తుతం ప్రభాస్ లైనప్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక అందులో భాగంగానే ఆయన మారుతీతో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాని చేయడానికి సిద్ధమయ్యాడు. రాజాసాబ్ అనే టైటిల్ తో తెరక్కెక్కుతున్న ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మీద ప్రభాస్ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకుండా లైట్ వెయిట్ తో సినిమాని కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. ఎందుకంటే ఈ సినిమా కమర్షియల్ సినిమాలనే ఉంటుంది.

    కాబట్టి ఇంతకుముందు ప్రభాస్ చేసిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా ఉండబోతుంది.. అయితే బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ ఇలాంటి సినిమాలు చేయడం మానేశాడు. మొత్తం కంటెంట్ బెస్డ్ గా ఉండే కథలను చేస్తూ కొత్త తరహా విధానాలను అనుసరిస్తే ముందుకు వెళ్తున్నాడు. కానీ రాజాసాబ్ మాత్రం ప్రభాస్ ఇంతకుముందు చేసిన డార్లింగ్, మిర్చి లాంటి ఒక రోటీన్ కమర్షియల్ సినిమాగా రాబోతుంది.

    మరి ఈ సినిమా ద్వారా ప్రభాస్ ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక అందులో భాగంగా ఈ సినిమా వచ్చే సంవత్సరం లో రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా డైరెక్టర్ మారుతి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కనక సాధించినట్టైతే మారుతి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటాడు.

    లేకపోతే మాత్రం మారుతి మళ్లీ మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. ఇక ఏది ఏమైనా మారుతి లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి స్టార్ హీరో అవకాశం ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక రాబోయే సినిమాలతో ప్రభాస్ ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…