Prabhas: ప్రభాస్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..? అది చేయడానికి ఎంత రిస్క్ అయిన చేస్తాడా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. కొంతమంది వరుస సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరోల రేంజ్ ను టచ్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం సక్సెస్ లేక అవకాశాలు రాక ఏదో అలా సినిమాలను చేస్తూ ముందుకు కదులుతూ ఉంటారు...

Written By: Gopi, Updated On : October 8, 2024 11:25 am

Prabhas

Follow us on

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ని స్టార్ట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుతున్నాడు. చాలా తక్కువ సమయంలో పాన్ ఇండియా సినిమాలను తీసి భారీ సక్సెస్ లను అందుకోవడంలో ప్రభాస్ ను మించిన వారు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ లైనప్ కనక చూసుకునట్లైతే భారీ దర్శకులతో సినిమాలు చేయడమే కాకుండా ఆయన సాధించిన సక్సెస్ లు కూడా భారీగా ఉండడం సగటు తెలుగు ప్రేక్షకులందరికీ ఆనందాన్ని ఇస్తుంద. ఇక ఫౌజీ సినిమా తర్వాత ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి సినిమా సూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక కల్కి సినిమాకి సీక్వేల్ గా వస్తున్న ‘కల్కి 2’ సినిమాలో కూడా తన నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ప్రభాస్ ఇప్పుడు దానికి సీక్వెల్ ని కూడా చేసే ఆలోచనలో ఉన్నాడు. దాదాపు ప్రభాస్ ఒక మూడు సంవత్సరాల వరకు ఈ సినిమాలతోనే తన కాలం గడిపే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే మారుతి తో చేస్తున్న రాజాసాబ్ సినిమా కూడా తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రభాస్ కి ఒక డ్రీమ్ రోల్ చేయాలనే కోరిక అయితే ఉందట. అది ఏంటి అంటే గూఢచారి సినిమాల్లో అడ్వెంచర్స్ చేస్తూ ఉంత్ల్డ్ ఒక పాత్రలో నటించాలనే కోరిక అయితే ఉందట. రీసెంట్ గా ఆయన తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఇక అలాంటి సినిమా చేయడానికి తను ఎలాంటి రిస్క్ అయినా సరే చేస్తానని ఒక అడ్వెంచర్ జానర్ లో సాగే సినిమా కోసం తను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

కానీ అలాంటి కథలు తన దగ్గరికి రావడం లేదని ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక మొత్తానికైతే ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ ను సాధిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన దగ్గరికి ఒక మంచి గూడచారి కథతో కనక వెళితే ఆయన తప్పకుండా ఆ కథను యాక్సెప్ట్ చేసి సినిమా చేయడానికి ఆస్కారం అయితే ఉంది…