NTR: నందమూరి తారక రామారావు గారు ఇండస్ట్రీకి చేసిన సేవల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ప్రతి ఒక్క తెలుగు వాడు గర్వంగా తలెత్తుకొని తిరిగేలా చేశాడు. మరి మొత్తానికైతే ఆ మహనీయుడు చేసిన సేవలకు గాను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ అతన్ని తలుచుకోకుండా ఉండలేరు. ఇక అలాంటి ఒక గొప్ప పని చేసిన నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ నుంచి రెండోవ తరం హీరోగా బాలకృష్ణ వచ్చాడు. మరి బాలయ్య బాబు తనదైన రీతిలో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ను సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక మొత్తానికైతే తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇప్పటికీ వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తను మించిన నటుడు లేడు అనే అంతలా గుర్తింపు అయితే పొందుతున్నాడు. ఇక వీళ్ల తర్వాత నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ భారీ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియాలో తనలాంటి గొప్ప నటుడు లేడు అనేంతలా కీర్తి ప్రతిష్టలను పొందుతున్నాడు.
ఇక రీసెంట్ గా దేవర సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఎలాగైనా సరే రాబోయే సినిమాలతో కలెక్షన్స్ సునామిని సృష్టించాలని చూస్తున్నాడు… ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎన్టీఆర్ కోసం కొన్ని కథలు రెడీ చేసిన ఒక దర్శకుడు మాత్రం ఇప్పటికీ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అయినప్పటికీ ఆ దర్శకుడికి అవకాశం అయితే రావడం లేదు.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే తరుణ్ భాస్కర్… పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తన తదుపరి సినిమాను ఎన్టీయార్ తో చేయాలనుకున్నాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయి తప్ప తరుణ్ భాస్కర్ కి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ ఇవ్వడం లేదు.
ఇక ఇప్పటికే కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తరుణ్ భాస్కర్ ఇక ఎన్టీఆర్ ను లైట్ తీసుకొని వేరే హీరో చుట్టూ తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తరుణ్ భాస్కర్ లాంటి దర్శకుడితో సినిమా చేయకపోవడం అనేది ఒక బ్యాడ్ విషయమనే చెప్పాలి…