Anil Ravipudi And Maruthi: కళ్ళు చెదిరే ఇంటీరియర్.. లంబోర్ఘని లాంటి కార్లు.. విశాలవంతమైన పార్కింగ్.. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా.. లగ్జరీ అనే పదానికి పరాకాష్ట మాదిరిగా ఉంది అక్కడి వాతావరణం. ఇక్కడ ఉంటున్నది పేరు మోసిన వ్యాపారులు కాదు. పెద్దపెద్ద రాజకీయ నాయకులు అంతకంటే కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న దర్శకులు.
ఇటీవల రాజా సాబ్ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి భావోద్వేగంతో మాట్లాడాడు. ఈ సినిమా నచ్చకపోతే ప్రభాస్ అభిమానులు తన ఇంటికి రావాలని.. తన ఇంటి అడ్రస్ కొండాపూర్ లోని కొల్లా లగ్జూరియా అని.. తన విల్లా నెంబర్ 17 అని ప్రకటించాడు. సాధారణంగా దర్శకులు తమ ఇంటి అడ్రస్ బయట పెట్టుకోరు. తమ వ్యక్తిగత విషయాలను కూడా బయట పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ, మారుతి ఆ ప్రకటన చేసిన తర్వాత.. కొండాపూర్ లోని కొల్లా లగ్జూరియా ప్రాంతం గురించి కొంతమంది శోధించడం మొదలుపెట్టారు. అలా వారు శోధించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
కొండాపూర్ లోని కొల్ల లగ్జూరియా అనేది అత్యంత విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ విల్లా నెంబర్ 17 లో దర్శకుడు మారుతి, విల్లా నెంబర్ 19 లో అనిల్ రావిపూడి ఉంటున్నట్టు తెలుస్తోంది. మారుతి రాజా సాబ్, అనిల్ రావిపూడి మన శివ శంకర వరప్రసాద్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నాయి. ఈనెల 9న రాజా సాబ్, ఈనెల 12న మన శివశంకర వరప్రసాద్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి ప్రీమియర్ షో టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉన్నాయి. ఏపీ గవర్నమెంట్ టికెట్ల ధరల పెంపుదలకు ఒప్పుకోగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది..
ఇదే గేటెడ్ కమ్యూనిటీలో.. తెలంగాణ రాష్ట్రంలో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ స్థానం నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే కూడా విల్లా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.. మారుతి రాజా సాబ్ ఫ్రీ రిలీజ్ సందర్భంగా చెప్పిన కొల్ల లగ్జూరియా గేటెడ్ కమ్యూనిటీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అడ్డగోలుగా సినిమా టికెట్ రేట్లు పెంచి.. ప్రేక్షకుల నుంచి దారుణంగా దోచుకొని.. ఇప్పుడు ఇలాంటి విల్లాలలో సుఖాలు అనుభవిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు..”అభిమానం అనే మత్తులో ముంచుతున్నారు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకొని.. దర్శకులు, నటులు ఇలాంటి వైభోగాలలో మునిగి తేలుతున్నారు. వీరిని అభిమానించిన పిచ్చి జనం మాత్రం తొక్కిసలాటలో చనిపోతున్నారు. ఇప్పటికైనా వీరి లైఫ్ స్టైల్ చూసి చాలామంది తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. వేలకు వేలు పెట్టి టికెట్లు కొనుగోలు చేయడం వల్ల ఎవరికి మేlo ఆలోచించుకోవాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఇవే ఈ సంక్రాంతి బరిలో ఉన్న రాజాసాబ్, మన శంకర్ వరప్రసాద్ సినిమా దర్శకుల కొండాపూర్ కొల్లా లక్సూరియా నివాసాలు.
విల్లా 17 కొల్ల లక్సురియా లో మారుతి గారు.
విల్లా 19 లో అనిల్ రావిపూడి గారిది అని సమాచారం.
ఇక విల్లా నంబర్ 420 లో హుజూరాబాద్ ఎమ్మెల్యే గా గెలిచిన 3 నెలలకే అత్యధికంగా… pic.twitter.com/Kk6tAAweFV
— Vennela Kishore Reddy (@Kishoreddyk) January 6, 2026