Raja Saab Overseas Collections: ఈమధ్య కాలం లో ఓవర్సీస్ ఆడియన్స్ బాగున్న సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు, అదే విధంగా బాగాలేని సినిమాలను ప్రీమియర్ షోస్ తర్వాత అడ్డంగా తోక్కేస్తున్నారు. ఒకప్పుడు బాగాలేని పెద్ద హీరోల సినిమాలు వీకెండ్ వరకు అయినా ఆడేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రీమియర్స్ + మొదటి రోజు తోనే ఆగిపోతున్నాయి. అందుకే లేటెస్ట్ ఉదాహరణ ‘రాజా సాబ్'(The Rajasaab Movie). విడుదలకు ముందు 1 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కచ్చితంగా 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ ని సొంతం చేసుకుంటుందని అనుకున్నారు ట్రేడ్ పండితులు. కానీ కేవలం 1.38 మిలియన్ డాలర్ల గ్రాస్ ని మాత్రమే సొంతం చేసుకుంది. ఓవరాల్ గా మొదటి రోజు + ప్రీమియర్ షోస్ కలిపి ఈ చిత్రానికి 1.78 మిలియన్ గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.
ఇది ‘గుంటూరు కారం’ కంటే చాలా తక్కువ అట. రెండవ రోజు వసూళ్లు అయితే #300K కంటే తక్కువ గ్రాస్ వచ్చింది. ఇది ఈ చిత్రానికి మరో పెద్ద కోలుకోలేని షాక్ అనొచ్చు. శనివారం రోజున నార్త్ అమెరికా లో ఫ్లాప్ సినిమాలకు కూడా కనీస స్థాయి గ్రాస్ వసూళ్లు నమోదు అవుతుంటాయి. కానీ ఈ చిత్రానికి వచ్చిన డ్రాప్స్ ని చూస్తుంటే ఫుల్ రన్ లో కూడా ‘గుంటూరు కారం’ క్లోజింగ్ కలెక్షన్స్ ని దాటేలా అనిపించడం లేదు. గుంటూరు కారం చిత్రానికి USA నుండి 2.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు క్లోజింగ్ లో వచ్చాయి. ఓవరాల్ నార్త్ అమెరికా లో ఆ చిత్రానికి 2.67 మిలియన్ డాలర్లు వచ్చాయి. కానీ ‘రాజా సాబ్’ కి క్లోజింగ్ లో కూడా అంత మొత్తం వసూళ్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు. కానీ ఓవర్సీస్ లోని ఇతర దేశాల్లో మాత్రం ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి.
వరుసగా ఈవెంట్ మూవీస్ చేస్తూ రావడం వల్ల, ప్రభాస్ సినిమాలను ఒక సెక్షన్ ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి చూడడం ఒక అలవాటు గా మారిపోయింది. ఆ కారణం చేతనే ఇలాంటి చోట్ల టాక్ తో సంబంధం లేకుండా ఆయనకు వసూళ్లు వస్తున్నాయి. UK లో రెండు రోజుల్లో $400K డాలర్లు వచ్చాయి. ఇది మిగిలిన స్టార్ హీరోలకు సూపర్ హిట్ టాక్ మీద రావడం కూడా కష్టం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు నార్త్ అమెరికా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7.5 మిలియన్ డాలర్లకు జరిగింది. సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యేసరికి ఈ సినిమా ద్వారా బయ్యర్ కి 5 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.