Raja Saab overseas bookings: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం వచ్చే నెల 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందరభంగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతోంది. VFX షాట్స్ కూడా దాదాపుగా డెలివరీ అయిపోయాయి అట. త్వరలోనే ప్రభాస్ కూడా డబ్బింగ్ పూర్తి చేయనున్నాడు. అంతే కాకుండా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ నెల రెండవ వారానికి మొదటి కాపీ సిద్ధం అయిపోతుంది అట. అయితే ఈ ఓవర్సీస్ లో ప్రతీ సినిమా విడుదలకు నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి 37 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు.
అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి. ఆరంభం లో అభిమానులే ఏ సినిమాకు అయిన టికెట్స్ బుక్ చేసుకుంటారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకో ఈ విషయం లో వెనకపడ్డారని అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉదాహరణకి రీసెంట్ గానే ప్రభాస్ నటించిన ‘బాహుబలి ; ది ఎపిక్’ రీ రిలీజ్ కి బుకింగ్స్ మొదలు పెట్టిన 24 గంటల్లో 60 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘రాజా సాబ్’ కి బుకింగ్స్ ని మొదలు పెట్టిన 24 గంటల్లో 18 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. ఇది నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. కేవలం బాహుబలి రీ రిలీజ్ కంటే తక్కువ మాత్రమే కాదు, ఈ చిత్రానికి ‘అఖండ 2 ‘ అడ్వాన్స్ బుకింగ్స్ కంటే తక్కువ గ్రాస్ వచ్చింది.
‘అఖండ 2’ చిత్రానికి మొదటి 24 గంటల్లో దాదాపుగా 28 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘రాజా సాబ్’ కి 18 వేల డాలర్ల గ్రాస్ రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కానీ ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. అంతే కాకుండా ప్రమోషనల్ కంటెంట్లు కూడా ఇంకా పూర్తి స్థాయి విడుదల చేయలేదు. రాబోయే రోజుల్లో వరుసగా ప్రమోషనల్ కంటెంట్ ని విడుదల చేస్తూ పోతే కచ్చితంగా ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడుతుంది, తద్వారా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా ఊపు అందుకుంటాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుంది అనేది.