Raja Saab Tickets Prices: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే టికెట్ రేట్లు భారీగా పెంచుతున్న విషయం మనకు తెలిసిందే. 1000 రూపాయలకు పైనే టికెట్ రేట్లు పెట్టి మొదటి వీక్ లోనే భారీగా డబ్బులును కలెక్ట్ చేయాలనే ప్రయత్నంలో మేకర్స్ అయితే ఉన్నారు. కానీ ప్రేక్షకుడు సైతం అంత మొత్తంలో డబ్బులు వెచ్చించి సినిమాకి వెళ్లాలంటే సినిమాలో మంచి కంటెంట్ ఉండాలి. అలాంటి కంటెంట్ ఉన్నప్పుడు ప్రేక్షకుడు సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. ఇక సంక్రాంతి కానుక వస్తున్న రాజాసాబ్ సినిమా విషయంలో అదే జరగబోతోంది. టికెట్ రేట్ ని భారీగా పెంచాలనే ప్రయత్నం చేస్తున్న మేకర్స్ కి అభిమానుల నుంచి గాని ప్రేక్షకుల నుంచి గాని చిక్కు ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమా టిక్కెట్ రేట్ భారీగా పెంచినట్లయితే మాత్రం సినిమాకి భారీ నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి…
టిక్కెట్ రేటు పెంచితే ఎవరు ఈ సినిమాను చూసే అవకాశాలు లేకుండా పోతాయి. ఎందుకంటే సినిమా మీద ఇప్పటికే అంచనాలైతే పెద్దగా లేవు. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద హైప్ వేరే రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ సినిమా మీద అంత పెద్దగా అంచనాలైతే రావడం లేదు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్నప్పటికి ఈ సినిమా మీద అంచనాలు అంతంత మాత్రం గానే ఉన్నాయి.
ప్రభాస్ అభిమానులకు తప్ప ఈ సినిమా రావడం పెద్దగా ప్రేక్షకులు కూడా నచ్చలేదు. ఎందుకంటే మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడం వల్ల ఇక ప్రభాస్ చేయనటువంటి హర్రర్ కామెడీ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించడం కూడా ఈ సినిమాకి భారీగా మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ సినిమాంటే హీరోయిజం, ఎలివేషన్స్ అలాగే ఎమోషన్స్ భారీ రేంజ్ లో ఉండాలని మనం అనుకుంటాం.
అలాగే ఫైట్ సీక్వెన్స్ లో ప్రభాస్ చేసే విన్యాసాలను చూసి ప్రేక్షకులు ఆనందపడుతుంటాం… ఇక ఇవేవీ ఈ సినిమాలో పెద్దగా కనిపించే అవకాశాలైతే లేవు… అలాగే దెయ్యం వచ్చినప్పుడు ప్రభాస్ భయపడితే అతని అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు. ప్రేక్షకులు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారా లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి…