Raja Saab Movie : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ అయితే నెగిటివ్ గానే వచ్చింది కానీ, మొదటి వీకెండ్ మాత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజున 13 కోట్ల రూపాయిలు, మూడవ రోజున 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా సంక్రాంతి సెలవుల్లో ఎంతో కొంత వసూళ్లను రాబట్టి, కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ కి వెళ్లకపోయినా, బిలో యావరేజ్ రేంజ్ లో అయినా వసూళ్లను రాబట్టే సత్తా ఈ చిత్రానికి ఉంది. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 4 నుండి 5 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
అయితే కొన్ని ప్రాంతాల్లో లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని భారీ గా తొక్కేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు నేడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విడుదలైంది. అనంతపురం లాంటి పాపులర్ సిటీ లో ‘రాజా సాబ్’ చిత్రానికి కేవలం ఒకే ఒక్క థియేటర్ కేటాయించారు. మిగిలిన అన్ని థియేటర్స్ లోనూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రమే నడుస్తుంది. ‘రాజా సాబ్’ కచ్చితంగా కేవలం ఒక్క థియేటర్ కి మాత్రమే పరిమితం అయ్యేంత వసూళ్లను రాబట్టడం లేదు. కయీసం మూడు థియేటర్స్ ని కేటాయించవచ్చు. కానీ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ సహకరించడం లేదు. చిరంజీవి సినిమాకు టాక్ వచ్చేసింది, ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కడుతారు , ఉన్న ఈ థియేటర్స్ కూడా సరిపోవు అంటూ సమాధానం చెప్తున్నారట.
కేవలం ఈ ఒక్క ప్రాంతం లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం ప్రాంతాల్లో ‘రాజా సాబ్’ కి ఇదే పరిస్థితి ఎదురు అవుతుందట. ఇక రేపటి నుండి మరో మూడు సినిమాలు సంక్రాంతి బరిలో నిలబడబోతున్నాయి. ఈ మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే, ‘రాజా సాబ్’ కి ఉన్న ఆ కాస్త థియేటర్స్ కూడా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇలా అయితే ‘రాజా సాబ్’ ని అత్యధిక రేట్స్ తో కొనుగోలు చేసిన బయ్యర్స్ కి భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 200 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ఇప్పటి వరకు వంద కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. మరో వంద కోట్ల షేర్ రావడం అనేది దాదాపుగా అసాధ్యమే. చూడాలి మరి ఈ సంక్రాంతి సెలవుల్లో ఏ మేరకు ఈ చిత్రం నెట్టుకొస్తోంది అనేది.