Raja Saab Movie Plus and Minus Points: రెబల్ స్టార్ ప్రభాస్(Rebal Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా విడుదలైంది. మొదటి నుండి ఈ సీఎంగా పై అభిమానుల్లో అంచనాలు లేవు, కానీ కొత్తగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కారణంగా, ఈ సినిమాలో కచ్చితంగా ఎదో మ్యాటర్ ఉంది, థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే అనే ఫీలింగ్ ని కలిగించింది. పైగా తమన్ అందించిన పాటలు కూడా యావరేజ్ రేంజ్ లో క్లిక్ అయ్యాయి. ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. అసలు డైరెక్టర్ మారుతీ ఏమనుకొని ఈ చిత్రాన్ని తీసాడు?, హారర్ జానర్ అనుకోని తీసాడా?, లేదా హారర్ అడ్వెంచర్ అనుకోని తీసాడా ?, ఏందీ మాకు ఈ టార్చర్ అంటూ సోషల్ మీడియా లో చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలోని ప్లస్సులు, మైనస్సులు గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్లస్సులు:
* ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ ప్రభాస్. చాలా కాలం తర్వాత తనలోని కామెడీ టైమింగ్ ని బయటకు తీసాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోసే ప్రయత్నం చేసాడు. లుక్స్ కూడా అత్యధిక శాతం సన్నివేశాల్లో చాలా బాగున్నాయి.
* ఇక ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. మొదట్లో కొన్ని సన్నివేశాల్లో చాల్ లౌడ్ గా అనిపిస్తాయి. కానీ కొన్ని సన్నివేశాలకు ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కలిసొచ్చింది.
* ఈ సినిమాలోని ప్లాట్ చాలా ఆసక్తికరమైనది. రెగ్యులర్ హారర్ సినిమాలు లాగా కాకుండా, ప్రభాస్ తో చేస్తున్నాం కాబట్టి, కాస్త కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు డైరెక్టర్.
మైనస్సులు :
*ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే, అది స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫిల్లర్ సన్నివేశాలతో నింపేసాడు డైరెక్టర్ మారుతీ. కథ ముందుకు జరగదు, కేవలం ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్, అదే విధంగా సెకండ్ హాఫ్ లో చివరి 30 నిమిషాలు మాత్రమే ఆయన స్క్రీన్ ప్లే మీద ద్రుష్టి పెట్టాడు. మిగిలిన రెండు గంటల సినిమా ఎటు వెళ్తుందో కూడా ఎవరికీ అర్థం అవ్వని పరిస్థితి.
* ప్రభాస్ అంటేనే యాక్షన్ సన్నివేశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటోడు. అలాంటి ప్రభాస్ తో అత్యంత పేలవమైన ఫైట్ సన్నివేశాలను రాసుకున్నాడు. కొన్ని ఫైట్స్ లో అయితే గ్రాఫిక్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి.
* ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ని డైరెక్టర్ ఎందుకు తీసుకున్నాడో అర్థం అవ్వదు. కథలో వాళ్లకు ఏ మాత్రం ప్రాముఖ్యత లేదు. ప్రభాస్ తో వీళ్ళ రొమాంటిక్ సన్నివేశాలు ఒక్కటి కూడా పండలేదు.
* మారుతీ నుండి కామెడీ సన్నివేశాలు ఆశించడం లో తప్పు లేదు. ఎందుకంటే ఆయన కెరీర్ మొత్తం అలాంటి సినిమాలే తీసుకుంటూ వచ్చాడు. కానీ ఈ చిత్రం లో ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకుల చేత నవ్వు రప్పించదు అంటే అతిశయోక్తి కాదేమో.