Prabhas fans viral video: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasab Movie) చిత్రం నిన్న ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా విడుదలై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. సలార్, కల్కి లాంటి భారీ యాక్షన్ చిత్రాలను చూసిన ఆడియన్స్ కి ప్రభాస్ నుండి ఎలాంటి సినిమాలు ఆశిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటిది డైరెక్టర్ మారుతీ తో సినిమా అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ మొదట్లో చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఈ చిత్రాన్ని ఆపేయాలి అంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేశారు. వాళ్ళ అలా ఎందుకు చేశారో ఈరోజు సినిమాని చూసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. కానీ విడుదలకు ముందు ఈ సినిమాపై ఫ్యాన్స్ లో కచ్చితంగా హిట్ అవుతుందని ఎక్కడో ఒక మూలాన నమ్మకం ఉండేది.
ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి మరి. ఈ సినిమా చూడండి, మీకు నచ్చకపోతే నా ఫ్లాట్ కి వచ్చేయండి అంటూ అడ్రస్, డోర్ నెంబర్ తో సహా చెప్తాడు మారుతీ. అలా చెప్తూ ఆరోజు ఆయన చాలా ఎమోషనల్ అయిపోతాడు. మాట్లాడున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు. అతన్ని ఓదార్చడానికి క్రింద కూర్చున్న ప్రభాస్ కూడా స్టేజి మీదకు రావాల్సి వచ్చింది. అంత ఎమోషనల్ అయ్యేలోపు, కచ్చితంగా ఔట్పుట్ ని చింపేసి ఉంటాడు, ఫ్యాన్స్ ధైర్యం గా ఉండొచ్చని ప్రతీ ఒక్కరు అనుకున్నారు. కానీ ఈరోజు ఔట్పుట్ చూసిన తర్వాత ఏ ధైర్యం తో మారుతీ ఇంటి అడ్రస్ ఇచ్చాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఉన్న కోపం చూస్తుంటే నిజంగానే మారుతీ ఇంటికి వెళ్లి కొట్టేలా ఉన్నారు. పబ్లిక్ టాక్ లోని అభిమానుల రియాక్షన్స్ అలాగే ఉంది మరీ.
అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. డైరెక్టర్ మారుతీ పాపం కొత్తగా తీసే ప్రయత్నం అయితే చేసాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా టేకింగ్ విషయం లో ఆయన చాలా అయ్యోమయ్యం కి గురైనట్టు తెలుస్తోంది. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ని పెట్టుకున్నప్పుడు ఆయన రేంజ్ కి తగ్గ యాక్షన్ మూవీ నే చెయ్యాలి. అలా కాకుండా, ఇలాంటి సినిమాలు తీస్తే దారుణంగా మిస్ ఫైర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీడియం రేంజ్ హీరోలు కూడా అవకాశం ఇవ్వడానికి ఆలోచించే సమయంలో, ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ మారుతీ కి అవకాశం ఇవ్వడం గోల్డెన్ ఛాన్స్ లాంటిది. దాన్ని సరిగా ఉపయోగించుకుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి టాప్ పాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఎదిగేవాడు. ఆ అవకాశం సర్వనాశనం అయ్యింది.