Raja Saab Flop: ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) చేసిన చిత్రాల్లో ‘రాధే శ్యామ్’ అత్యంత తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది. ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమా ప్రభాస్ స్టార్ స్టేటస్ కి ఒక మాయని మచ్చ లాగా మిగిలిపోయింది. ‘బాహుబలి 2’ నుండి ‘కల్కి’ వరకు ప్రభాస్ చేసిన ప్రతీ సినిమాకు మొదటి రోజున వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, ఒక్క ‘రాధే శ్యామ్’ చిత్రానికి తప్ప. మళ్లీ అలాంటి దయనీయమైన పరిస్థితి ప్రభాస్ కి రాదని అంతా అనుకున్నారు. కానీ రెస్ట్ గా విడుదలైన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం కూడా ‘రాధే శ్యామ్’ క్యాటగిరీలోకి వెళ్ళిపోయింది. ఈ చిత్రానికి మొదటి రోజున కేవలం 92 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రభాస్ వరుస వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్ రికార్డు కి బ్రేక్ పడింది.
కానీ నిర్మాతలు మాత్రం ఈ చిత్రానికి ఏకంగా 112 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మార్కెటింగ్ కోసం ప్రతీ సినిమా నిర్మాతలు చేసే పబ్లిసిటీ లాంటిదే ఇది, ‘రాజా సాబ్’ మొదటి రోజున అంతటి వసూళ్లను రాబట్టలేదని అంటున్నారు. ఇక రెండవ రోజు వసూళ్లు అయితే నైజాం ప్రాంతం లో తప్ప, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో భారీగా డ్రాప్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రెండవ రోజున 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా ప్రభాస్ సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో చూసే ఆడియన్స్ కారణంగా వచ్చిందని, నేటి అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం అయినప్పటికీ కూడా దారుణంగా ఉన్నాయని, రెండవ రోజు తో పోలిస్తే 70 శాతం డ్రాప్స్ అయ్యాయని అంటున్నారు.
ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి క్లోజింగ్ లో 200 కోట్ల గ్రాస్ లోపే వచ్చేలా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సంక్రాంతి సెలవుల్లో కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు నమోదు అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే కొత్త సినిమాలు దాదాపుగా ‘రాజా సాబ్’ థియేటర్స్ ని లాగేసుకుంటున్నాయి. కాబట్టి ఈ చిత్రం పికప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువని అంటున్నారు ట్రేడ్ పండితులు. కనీసం ఇక్కడ కాకపోయినా, బాలీవుడ్ లో అయినా ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతాయని అనుకుంటే , అక్కడ ఇంకా దారుణమైన వసూళ్లను సొంతం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది ఈ చిత్రం. ఇక రేపు విడుదల అవ్వబోయే చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ చిత్రానికి ఎంత నష్టం వస్తుందో చూడాలి.