Director Maruthi: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతుందని అంతా ఊహించారు. కానీ రెండవ రోజే భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ప్రభాస్ ఎన్నో ఏళ్ళ తర్వాత తన వింటేజ్ యాంగిల్ ని బయటకు తీసి, ఫుల్ ఎనర్జీ తో ఈ సినిమా చేసాడు. కానీ డైరెక్టర్ మారుతీ సహకరించకపోవడం తో ఈ సినిమా ఇప్పుడు డిజాస్టర్ ఫ్లాప్ వైపు అడుగులు వేస్తోంది. పెద్ద స్టార్ హీరోలు మీడియం రేంజ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇవ్వడానికి ఎందుకు భయపడతారో తెలుసా?, ఇలాంటి సినిమాలు ఇస్తారనే భయం తోనే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. స్టార్ హీరోలలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ తప్ప ఎవ్వరూ కూడా మీడియం రేంజ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇవ్వరు. ఇచ్చే ఈ ఇద్దరి హీరోలను కూడా ఇలాంటి సినిమాలు తీసి భయపడేలా చేస్తున్నారు.
ఇకపోతే నిన్న ఈ సినిమాకు మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈమధ్య కాలం లో సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా రెండవ రోజే సక్సెస్ మీట్స్ పెట్టేస్తున్నారు. ‘రాజా సాబ్’ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. అయితే ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ మారుతీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా అర్థం అవ్వని వాళ్ళు ఫోన్ చేసి బూతులు తిడుతున్నారు. ఇలాంటి కమర్షియల్ సినిమాలకు ఆన్లైన్ లో టాక్ రావడం కష్టమే. గతం లో కూడా ఎన్నో సినిమాలకు ఇలాంటి టాక్ సోషల్ మీడియా ద్వారా వచ్చింది. కానీ కమర్షియల్ గా అవి సక్సెస్ అయ్యాయి. కాబట్టి సినిమా ఫలితాన్ని అప్పుడే నిర్ణయించకండి’ అంటూ చెప్పుకొచ్చాడు మారుతీ.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా పై ఆడియన్స్ ఆసక్తి కలగడానికి గల ముఖ్య కారణాల్లో ఒకటి ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో కనిపించడం. ఈ గెటప్ సినిమాలో లేకపోవడం అభిమానుల్లో కోపం మామూలు రేంజ్ లో రాలేదు. ఈ విషయాన్నీ కూడా మారుతి ఈ సక్సెస్ మీట్ లో ప్రస్తావించాడు. సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణం ఆ గెటప్ లో ఉన్నటువంటి సన్నివేశాలు లేకపోవడం వల్లే అని మారుతీ అనుకుంటున్నాడు. అందుకే నిన్నటి ఫస్ట్ షోస్ నుండి ఆ గెటప్ సన్నివేశాలను జత చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు మారుతీ. దీని వల్ల కలెక్షన్స్ బాగా పెరుగుతాయేమో అని అనుకున్నాడు కానీ, అది ఏ మాత్రం సహాయపడలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.