Prashanth Varma: ‘హనుమాన్’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ… ఆయన ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు… గతంలో బాలయ్య బాబు కొడుకుతో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చినప్పటికి ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇక ఇప్పుడు ‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం కన్నడ నటుడు అయిన రిషబ్ శెట్టి ని ఎంపిక చేశాడు. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులవుతున్నప్పటికి ఇప్పటివరకు సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి అంటే ప్రశాంత్ వర్మ వివిధ ప్రాజెక్టులను సెట్ చేసే పనిలో ఉన్నాడు. అందువల్లే ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇక కాంతార సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన రిషబ్ శెట్టి రీసెంట్ గా ప్రశాంత్ వర్మ తో ఒక మాట చెప్పాడట. నేను కేవలం నీకు మూడు నెలల సమయం మాత్రమే ఇస్తాను. ఈ సినిమాని కంప్లీట్ చేసుకుంటే చేసుకో లేదంటే ఈ సినిమా నుంచి నేను తప్పకుంటాను అని చెప్పారట. ఎందుకంటే ప్రస్తుతం రిషబ్ శెట్టి డైరెక్టర్ గా, హీరోగా మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు.
స్టార్ హీరోలను సైతం డైరెక్షన్ చేసే కెపాసిటి అతనికి ఉంది. ఇక నేపథ్యంలో ఆయన జై హనుమాన్ సినిమాకోసం తన టైమ్ ను వెస్ట్ చేసుకోవాలని అనుకోవడం లేదట. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సినిమాలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక దాంతో ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికైతే ఈ మూడు నుంచి నాలుగు నెలల లోపు రిషబ్ శెట్టి షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నాడు.
ఒక సినిమాతో వచ్చిన సక్సెస్ ని వాడుకొని మరొక సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలి గాని, ఆయన ప్రొడక్షన్ సైడ్ వెళ్ళి అక్కడ వర్క్ చూసుకోవడం లాంటివి ఎందుకు చేస్తున్నాడు అంటూ అతని మీద కొంతమంది ఫైర్ అవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ చేయడం వల్లే ఆయన చాలా వరకు డీలా పడిపోతున్నాడు…