
Raj Tarun Marriage: స్టార్ యాంకర్స్ రేసులో దూసుకొచ్చి సడన్ గా కనుమరుగైన అమ్మాయి లాస్య. అప్పట్లో ఈమెకు చెప్పుకోదగ్గ పాపులారిటీ ఉండేది. రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటి గ్లామరస్ యాంకర్స్ రాకముందు సత్తా చాటింది. యాంకర్ రవితో మా టీవీలో లాస్య చేసిన ‘సంథింగ్ స్పెషల్’ షో బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఆ టైం లో యాంకర్ రవితో ఆమె ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. పెళ్లి కాకముందు లాస్య ఇలాంటి ఎఫైర్ రూమర్స్ కొన్ని ఫేస్ చేశారు. వారిలో హీరో రాజ్ తరుణ్ ఒకరు.
రాజ్ తరుణ్-లాస్య ప్రేమించుకున్నారని, ఏకంగా లేచిపోయి పెళ్లి చేసుకున్నారని కథనాలు వెలువడ్డాయి. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో రాజ్ తరుణ్ స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఫేస్ బుక్ వేదికగా లాస్యతో ప్రేమ, పెళ్లి వార్తలలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై తరుణ్ తరుణ్ నేరుగా స్పందించారు. లాస్యను ను ఒక్కసారే కలిశాను. ఆమెతో పెద్దగా పరిచయం కూడా లేదు. ఎవరు పుట్టించారో తెలియదు ఆమెను నేను ప్రేమించానని, లేచిపోయి వివాహం చేసుకున్నాం అంటూ మార్ఫింగ్ ఫోటోలు ప్రచారం చేశారు. దాంతో మా ఫ్రెండ్స్ ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెప్పడం. అరె ఏం లేదురా, అదంతా అబద్ధం అని చెప్పుకోవాల్సి వచ్చింది.

ప్రచారం పరిధి దాటి ఎక్కువైపోవడం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాను. ఆ ఫోటోలు కూడా చాలా ప్రొఫెషనల్ గా మార్ఫింగ్ చేశారు. కొందరు ఖాళీగా కూర్చొని ఇలాంటి ఆలోచలు చేస్తుంటారనుకుంటా… అని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్ తరుణ్ గతంలో చెప్పిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. రెండో అబ్బాయికి ఇటీవల లాస్య జన్మనిచ్చారు. లాస్యను జనాలు దాదాపు మర్చిపోయారు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న లాస్య మరలా వెలుగులోకి వచ్చారు. ఈ మధ్య ఆమె బుల్లితెర షోలలో సందడి చేస్తున్నారు. మరోవైపు రాజ్ తరుణ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.