https://oktelugu.com/

హిట్ లేకపోయినా ఎమ్మెల్యే కూతుర్ని పట్టాడు !

లక్కీగా హీరోగా సెటిల్ అయిన రాజ్‌ తరుణ్‌ ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడి.. హిట్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. నిజానికి గతేడాది హిట్ గ్యారంటీ అని మనోడు వచ్చిన చిన్న సినిమాలను కూడా కాదనుకుని ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. హిట్ వస్తోందని రాజ్ తరుణ్ అంతగా నమ్మడానికి కారణం దిల్ రాజు. ఆయన సినిమా కాబట్టి హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యాడు. కానీ దిల్ రాజు నిర్మాణంలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 24, 2020 / 08:15 PM IST
    Follow us on

    లక్కీగా హీరోగా సెటిల్ అయిన రాజ్‌ తరుణ్‌ ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడి.. హిట్ కోసం పడిగాపులు కాస్తున్నాడు. నిజానికి గతేడాది హిట్ గ్యారంటీ అని మనోడు వచ్చిన చిన్న సినిమాలను కూడా కాదనుకుని ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. హిట్ వస్తోందని రాజ్ తరుణ్ అంతగా నమ్మడానికి కారణం దిల్ రాజు. ఆయన సినిమా కాబట్టి హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యాడు. కానీ దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాని ప్రేక్షకులు ఛీ కొట్టారు. దాంతో ఈ కుర్ర హీరో పరిస్థితి నిండా మునిగిపోయినట్టు అయింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా చాల స్పీడ్ గా ఎదిగి.. అంతే స్పీడ్ గా పడిపోయాడు అని రాజ్ తరుణ్ కి ఒక జాలి క్రియేట్ అయిపోయింది.

    Also Read: ‘రొమాంటిక్’ బ్యూటీ‌తో నాగశౌర్య రొమాన్స్‌!

    అయితే ఇప్పుడు ఈ కుర్రాడు పెళ్లి పై ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మనోడు త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడని.. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయే అని, వైజాగ్ కి చెందిన ఒక ఎమ్మెల్యే తమ్ముడు కూతురు అని ఫిల్మ్ సర్కిల్స్ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గాని, రాజ్ తరుణ్ మాత్రం ప్రేమ పెళ్లినే చేసుకోబోతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. ఎలాగూ ఇక సినిమాలు కూడా పెద్దగా లేవు కాబట్టి త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం బెటర్. ప్రసుతం కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ‘ఒరేయ్ …బుజ్జిగా’ అనే సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు.

    Also Read: విద్యా బాలన్ మళ్ళీ అందాల అరబోతకు సై !

    ఈ సినిమా కూడా ప్లాప్ అయితే హీరోగా రాజ్ తరుణ్ ఇక జెండా పీకేయ్యడమే. ఎలాగూ ఈ సినిమా అవుట్ ఫుట్ కూడా బాగా రాలేదని, వెరీ రొటీన్ ప్లేతో సాగుతూ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో రెగ్యులర్ గా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. పైగా తన కన్నా వయసులో పెద్దదైన ఓ అమ్మాయిని హీరో లవ్ చేస్తాడని.. మరి ముదురు భామతో సాగే ప్రేమ కథతో ఈ కుర్రాడు ఏమి హిట్ కొడతాడో ఏమో. అసలుకే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలం అయింది, గత ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. బాక్సాఫీస్ వద్ద హిట్ వాసన చూడలేకపోయాడు. పైగా ప్లాప్ ల వలయంలో కొట్టుకుపోతున్నాడాయే పాపం.