https://oktelugu.com/

‘రొమాంటిక్’ బ్యూటీ‌తో నాగశౌర్య రొమాన్స్‌!

యువ కథానాయకుడు నాగశౌర్య స్పీడు పెంచాడు. సొంతంగా కథ అందించి ‘అశ్వథ్థామ’తో ఈ ఇయర్ స్టార్టింగ్‌లో మంచి హిట్ ఖాతాలో వేసుకున్నాడు శౌర్య. ఆవెంటనే ‘సుబ్రమణ్యపురం’ ఫేమ్‌ సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఇప్పటికే ఓ మూవీని అనౌన్స్‌ చేశాడు. శరత్‌ మరార్, రామ్‌ మోహన్‌ రావు, సునీల్‌ నారంగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లాస్ట్‌ ఇయర్ అక్టోబర్లోనే మొదలైంది. ఓ చిన్న షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకుంది. మార్చి తర్వాత రెగ్యులర్ షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 24, 2020 / 06:51 PM IST
    Follow us on

    యువ కథానాయకుడు నాగశౌర్య స్పీడు పెంచాడు. సొంతంగా కథ అందించి ‘అశ్వథ్థామ’తో ఈ ఇయర్ స్టార్టింగ్‌లో మంచి హిట్ ఖాతాలో వేసుకున్నాడు శౌర్య. ఆవెంటనే ‘సుబ్రమణ్యపురం’ ఫేమ్‌ సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఇప్పటికే ఓ మూవీని అనౌన్స్‌ చేశాడు. శరత్‌ మరార్, రామ్‌ మోహన్‌ రావు, సునీల్‌ నారంగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లాస్ట్‌ ఇయర్ అక్టోబర్లోనే మొదలైంది. ఓ చిన్న షెడ్యూల్‌ కూడా పూర్తి చేసుకుంది. మార్చి తర్వాత రెగ్యులర్ షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరరకెక్కే ఈ మూవీలో నాగశౌర్య ఆర్చర్గా కనిపించబోతున్నాడు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ స్టార్ చేసిన ఈ ఇయర్ ఎండింగ్‌లోకి పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది చిత్ర బృందం.

    Also Read: విద్యా బాలన్ మళ్ళీ అందాల అరబోతకు సై !

    ఇక, ఈ మూవీ గురించి లేటెస్ట్‌గా ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా మోడల్‌ కేతిక శర్మను ఫైనల్‌ చేసినట్టు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫేమస్‌ అయి మోడలింగ్‌లో అడుగుపెట్టిన కేతిక ఇప్పటికే పూరి జగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్‌’ అనే మూవీతో తెరంగేట్రం చేయనుంది. ఆ మూవీ ఫొటో షూట్స్‌తో పాటు టీజర్లో హాట్‌ హాట్‌ అందాలతోయూత్‌ హార్ట్‌ బీట్‌ పెంచింది. స్కిన్ షో చేసేందుకు ఏ మాత్రం వెనకాడని కేతిక.. నాగశౌర్య మూవీలో కూడా గ్లామర్ పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో తిరిగి మొదలయ్యే షూటింగ్‌లో ఆమె పాల్గొననుంది.

    Also Read: ఆ లేడీ డైరెక్టర్ ఫుల్ బోల్డ్ గా తీసిందట !

    కాగా, ఈ మూవీతో పాటు మరో రెండు ప్రాజెక్టులతో నాగశౌర్య బిజీగా ఉన్నాడు. ఒకదానికి శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహించనుండగా.. మరో మూవీతో లక్ష్మి సౌజన్య డైరెక్టర్గా పరిచయం కానుంది. మరోవైపు లాక్‌డౌన్‌ టైమ్‌లో శౌర్య కొన్ని కథలు కూడా రాశాడని టాక్‌. ఈ రెండు మూవీల్లో ఒకదానికి శౌర్యనే స్ర్కిప్టు అందిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే, లవర్ బాయ్‌ ఇమేజ్‌ను పక్కనపెట్టి మాస్‌ హీరోగా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడతను. ఈ క్రమంలో తన శరీరాకృతిని కూడా మార్చుకునేందుకు ఇప్పటికే వర్కౌట్స్‌ చేస్తున్నాడు.