Bhale Unnade Trailer Review : భలే ఉన్నాడే ట్రైలర్ రివ్యూ: రాజ్ తరుణ్ కి మేటర్ లేదా? ఇంత సాహసం చేశాడేంటి!

రాజ్ తరుణ్ ఈ చిత్రంలో నపుంసకుడు పాత్ర చేశాడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కామెడీ రొమాన్స్ ప్రధానంగా భలే ఉన్నాడే ట్రైలర్ సాగింది. ఎంత కవ్వించినా అమ్మాయిని ఆ యాంగిల్ లో చూడని అబ్బాయిగా రాజ్ తరుణ్ రోల్ ఉంది.

Written By: NARESH, Updated On : August 19, 2024 8:37 pm

Bhale Unnade Trailer Review

Follow us on

Bhale Unnade Trailer Review : రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే. మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా ట్రైలర్ విడుదల చేశారు. కాగా రాజ్ తరుణ్ ఈ చిత్రంలో సాహసోపేతమైన పాత్ర చేశాడు. రాజ్ తరుణ్ నపుంసకుడుగా కనిపించనున్నాడు. భలే ఉన్నాడే ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. రాజ్ తరుణ్ ఇటీవల పెద్ద వివాదంలో ఇరుక్కున్నాడు. లావణ్య అనే యువతి ఆయన మీద కేసు పెట్టింది. లావణ్యతో రాజ్ తరుణ్ పదేళ్లకు పైగా సహజీవనం చేస్తున్నాడు. రాజ్ తరుణ్ హీరో కాక ముందు నుండి లావణ్యతో పరిచయం ఉంది. రాజ్ తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉండేవారు. తిరబడర సామీ మూవీలో తనతో జతకట్టిన మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ లావణ్యను దూరం పెడుతున్నాడట. రాజ్ తరుణ్ నన్ను రహస్య వివాహం చేసుకున్నాడు. రెండుసార్లు గర్భం దాల్చితే అబార్షన్ చేయించాడు.. అంటూ లావణ్య పలు ఆరోపణలు చేసింది. ఈ వివాదం కోర్టులో నడుస్తుంది. ఇదిలా ఉంటే మరో వివాదం తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ లో అసలు విషయం లేదంటూ ఓ యువతి వీడియో విడుదల చేసింది. నా ఫ్రెండ్ తో ఏడాది కాలంగా రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడు. ఆమె రాజ్ తరుణ్ లో అసలు మేటర్ లేదని చెప్పింది. లావణ్య విషయంలో రాజ్ తరుణ్ ఇలా చేశాడంటే ఎలా నమ్మాలి.

నా ఫ్రెండ్ కి రాజ్ తరుణ్ వలన ఒక ముద్దు ముచ్చట లేదంట. బెడ్ పై అటు వైపు తిరిగి పడుకుండాడట. రాజ్ తరుణ్ ఒక నపుంసకుడంటూ ఆ వీడియోలో యువతి చెప్పుకొచ్చింది. ఈ కొత్త వివాదం ఏమిటని జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగమని అర్థమైంది. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే. ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 19న విడుదల చేశారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ ఛాలెంజింగ్ రోల్ చేశాడు.

రాజ్ తరుణ్ ఈ చిత్రంలో నపుంసకుడు పాత్ర చేశాడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కామెడీ రొమాన్స్ ప్రధానంగా భలే ఉన్నాడే ట్రైలర్ సాగింది. ఎంత కవ్వించినా అమ్మాయిని ఆ యాంగిల్ లో చూడని అబ్బాయిగా రాజ్ తరుణ్ రోల్ ఉంది. ఇక హీరోని హీరోయిన్ పడే పాట్లు ఫన్నీగా ఉన్నాయి. రాజ్ తరుణ్ కి జంటగా మనీషా కంద్కూర్ నటించింది. ట్రైలర్ లో రాజ్ తరుణ్ రోల్ ఆసక్తి రేపుతోంది.

ట్రైలర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ పక్కా అనిపిస్తుంది. భలే ఉన్నాడే చిత్రానికి జే శివ సాయి వర్ధన్ దర్శకత్వం వహించాడు. రవి కిరణ్ ఆర్ట్స్, మారుతీ టీమ్ నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇటీవల రాజ్ తరుణ్ నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. పురుషోత్తముడు, తిరగబడర సామీ ఒక వారం వ్యవధిలో థియేటర్స్ లోకి వచ్చాయి. పురుషోత్తముడు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.

వివాదాల సంగతి ఎలా ఉన్నా రాజ్ తరుణ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే సాలిడ్ హిట్ పడితే కానీ రాజ్ తరుణ్ కెరీర్ గాడిన పడదు. భలే ఉన్నాడే మూవీతో రాజ్ తరుణ్ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. రాజ్ తరుణ్ సైతం భలే ఉన్నాడే చిత్రం మీదే ఆశలు పెట్టుకున్నాడు. భలే ఉన్నాడే మూవీ విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రయోగాత్మక పాత్రలో రాజ్ తరుణ్ ఎలా నటించాడో చూడాలి..