https://oktelugu.com/

ఆ హీరో, డైరెక్టర్ ల కెరీర్ లు పోయినట్టేనా ?

ఒకప్పుడు సక్సెస్ కొట్టిన హీరోకి కనీసం పదేళ్ల కెరీర్ ఉంటుంది. కానీ కాలం మారింది. హిట్స్ ఉన్నా.. వరుసగా రెండు మూడు ప్లాప్ లు వస్తే.. ఇక ఆ హీరో, జీరోగా మిగిలిపోతున్నాడు. ప్రస్తుతం యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ ది అలాంటి పరిస్థితే. మొదట్లో బాగానే హిట్లు వచ్చినా, ఆ తరువాత వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడిపోయి.. దిల్ రాజు లాంటి వారి వైపు దీనంగా చూస్తున్నాడు. కానీ దిల్ […]

Written By:
  • admin
  • , Updated On : July 14, 2020 / 04:40 PM IST
    Follow us on


    ఒకప్పుడు సక్సెస్ కొట్టిన హీరోకి కనీసం పదేళ్ల కెరీర్ ఉంటుంది. కానీ కాలం మారింది. హిట్స్ ఉన్నా.. వరుసగా రెండు మూడు ప్లాప్ లు వస్తే.. ఇక ఆ హీరో, జీరోగా మిగిలిపోతున్నాడు. ప్రస్తుతం యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ ది అలాంటి పరిస్థితే. మొదట్లో బాగానే హిట్లు వచ్చినా, ఆ తరువాత వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడిపోయి.. దిల్ రాజు లాంటి వారి వైపు దీనంగా చూస్తున్నాడు. కానీ దిల్ రాజు సైతం బాబుకు హిట్ ఇవ్వలేక ఇప్పటికే ఓ భారీ ప్లాప్ సినిమా తీశాడు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘ఇద్దరి లోకం ఒకటే’ ఈ కుర్ర హీరోని నిండా ముచ్చేసిందనే చెప్పాలి.

    ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా చాల స్పీడ్ గా హీరోగా ఎదిగిన రాజ్ తరుణ్.. ఒక్కసారిగా స్పీడ్ పోయి మార్కెట్ లేని హీరోగా పడిపోయాడనేది.. ప్రస్తుతం అతని సినిమాల రేట్స్ ను చూస్తే అర్ధమవుతుంది. ఇక ప్రస్తుతం కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ‘ఒరేయ్ …బుజ్జిగా’ అనే సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. కరోనా ప్రవాహంలో చిక్కుకున్న సినిమాల్లో ఈ సినిమా ఒక్కటి.

    ఒరేయ్‌ బుజ్జిగా.. టీజ‌ర్

    అయితే ఈ సినిమా పై రాజ్ తరుణ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు, ఎందుకంటే ఈ సినిమా కూడా బకెట్ తన్నేస్తే.. రాజ్ తరుణ్ అనే హీరో ఉండేవాడు అని ఆడియన్స్ చెప్పుకోవాల్సి వస్తోంది. అందుకే ఈ సినిమా కోసం రాజ్ తరుణ్ తెగ టెన్షన్ పడుతున్నాడు. కానీ, ఈ సినిమా అవుట్ ఫుట్ కూడా బాగా రాలేదని తాజాగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కథలో మ్యాటర్ లేకపోవడం.. పైగా మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో రొటీన్ తంతు వ్యవహారాలతో సినిమా ఉంటుందని ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ తేల్చేసిందట. సినిమాని కొనలేమని ఆ ప్లాట్ ఫామ్ తప్పుకుందట.

    పాపం ‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ సినిమాతో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత సినిమాల కోసం నానా అగచాట్లు పడిన కొండా విజయ్ కుమార్ కెరీర్ కి కూడా ఈ సినిమా చాల కీలకం.. మరీ ఈ సినిమా బాగలేకపోతే రాజ్ తరుణ్ తో పాటు కొండా కూడా ఇక సర్దుకోవడమే. మొత్తానికి సినిమాలో కంటెంట్ లేదని, స్క్రీన్ ప్లే కూడా బాగా బోర్ గా సాగుంతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది కాబట్టి, బాగోలేని సీన్స్ ను రీషూట్ చేసి.. ప్లాప్ శాతాన్ని తగ్గించుకుంటే బెటరేమో.