https://oktelugu.com/

Raj Tarun: నవంబర్ 12 న విడుదలకు సిద్దమైన … రాజ్ తరుణ్ “అనుభవించు రాజా” చిత్రం

Raj Tarun: ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత కెరీర్ లో వరుస హిట్స్ అందుకొని టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు ఈ యంగ్ హీరో. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఆయన కెరీర్ డైలమాలో పడింది. ఈ మేరకు ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ గదిలో పడాలంటే ఖచ్చితంగా హిట్ సాధించాలి. ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 31, 2021 / 08:08 PM IST
    Follow us on

    Raj Tarun: ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత కెరీర్ లో వరుస హిట్స్ అందుకొని టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు ఈ యంగ్ హీరో. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఆయన కెరీర్ డైలమాలో పడింది. ఈ మేరకు ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ గదిలో పడాలంటే ఖచ్చితంగా హిట్ సాధించాలి. ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కషీప్‌ ఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

    విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… రాజ్ తరుణ్ జల్సా రాయుడిగా కోడి పందాల స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు.  అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్పీ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ కి సంబంధించి ఓ అప్డేట్ ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ 26 న విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    పేకాట, కోడిపందాల నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పక్కా గోదావరి స్లాంగ్ లో రాజ్ తరుణ్ పలికే డైలాగ్స్, ఆయన గెటప్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి. గోపీ సుందర్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.  ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.