https://oktelugu.com/

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ కోసం 13 ఏళ్ల తర్వాత ట్విట్టర్ డీపీ మార్చిన … సుదీప్

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కర్ణాటకే ప్రజలకే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా షాక్ కలిగించింది. కాగా ఈరోజు పునీత్ అంత్యక్రియలను ఆయన అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ రాజ్ కుమార్ నిర్వహించారు. కంఠీరవ స్టూడియో లోని పునీత్ తల్లిదండ్రుల సమాధి వద్ద ఆయనకు అంత్యక్రియలు జరిపారు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన సేవ గుణంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు పునీత్ రాజ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 31, 2021 / 07:40 PM IST
    Follow us on

    Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కర్ణాటకే ప్రజలకే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా షాక్ కలిగించింది. కాగా ఈరోజు పునీత్ అంత్యక్రియలను ఆయన అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు వినయ్ రాజ్ కుమార్ నిర్వహించారు. కంఠీరవ స్టూడియో లోని పునీత్ తల్లిదండ్రుల సమాధి వద్ద ఆయనకు అంత్యక్రియలు జరిపారు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన సేవ గుణంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు పునీత్ రాజ్ కుమార్.

    పునీత్ హఠాన్మరణంతో అన్ని సినిమా ఇండస్ట్రీల నటులు ఆయనకు నివాళులు అర్పించారు. పునీత్‌కు కన్నడ ఇండస్ట్రీతో పాటు… పలు ఇండస్ట్రిల లోనూ మంచి స్నేహితులు ఉన్నారు. ఇక కన్నడ ఇండస్ట్రీలో పునీత్‌కు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో కిచ్చా సుదీప్ కూడా ఒకరు. పునీత్ కు  సుదీప్ కు  మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. అయితే పునీత్ మరణంతో సుదీప్ శోకసంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా పునీత్ మరణం పై  ఆయన స్పందించారు.

    పునీత్ రాజ్ కుమార్ గురించి సుదీర్ఘమైన లేఖను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ లో ” మొదటి సారి నిన్ను శివ మొగ్గలో కలిశాను. ఆ సమయంలోనే మనం మంచి స్నేహితులం అయ్యాం. నీతో కలిసిన ప్రతి సందర్బం నాకు చాలా ప్రత్యేకమైనది అని సుదీప్ రాశాడు. సుదీప్ ట్విట్టర్‌లోకి వచ్చి దాదాపు 13 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా సుదీప్ తన ట్విట్టర్ అకౌంట్ డీపీని మార్చకుండా అలాగే ఉంచాడు. ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడు దూరం అవ్వడంతో భావోద్వేగానికి గురైన సుదీప్… 13 ఏళ్ల తర్వాత తన డీపీని మార్చాడు. ఈ మేరకు పునీత్ రాజ్ కుమార్ ఫోటోను  ట్విట్టర్ డీపీగా పెట్టాడు సుదీప్ .