Homeఎంటర్టైన్మెంట్RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్ కోసం రెడీగా ఉండండి అంటున్న మూవీ యూనిట్... తాజాగా మరో...

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్ కోసం రెడీగా ఉండండి అంటున్న మూవీ యూనిట్… తాజాగా మరో పోస్ట్

RRR Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియో లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
rrr team release new poster about second glimps release
అయితే ఈ సినిమాకు సంబంధించి సెకండ్‌ గ్లింప్స్‌ విడుదల తేదీని చిత్ర బృందం ఇటీవలే ఖరారు చేసింది.  45 సెకండ్ల పాటు ఉండే వీడియో  గ్లింప్స్‌ ను నవంబర్‌ 1 వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో విడుదల చేస్తామని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా మరో పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.  దాంతో చిత్ర యూనిట్ ఎలాంటి అప్ డేట్ ఇస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి జక్కన్న ఎలాంటి అప్ డేట్ ఇస్తారో చూడాలి.ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
అటు చరణ్, తారక్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇటీవలే రాజ‌మౌళి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఫైనల్ కట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. కాగా మూవీ లో 30 నిమిషాల పాటు క్లైమాక్స్ ఉంటుందని… ఇది సినిమాకే మేజర్ హైలెట్ అని సమాచారం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version