https://oktelugu.com/

‘ఆర్‌ఆర్‌ఆర్’లో ట్రైబ్ గా యంగ్ కమెడియన్ !

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో టాలెంటెడ్ కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాహుల్ రామకృష్ణ స్నేహితుడి పాత్రలో అంటే ఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా నటించబోతున్నాడు. వచ్చే వారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లో రాహుల్ జాయిన్ అవ్వనున్నాడు. మరి ఎన్టీఆర్ కి ఫ్రెండ్ రోల్ అంటే ట్రైబ్ క్యారెక్టరే అయి […]

Written By:
  • admin
  • , Updated On : January 19, 2021 / 05:13 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో టాలెంటెడ్ కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాహుల్ రామకృష్ణ స్నేహితుడి పాత్రలో అంటే ఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా నటించబోతున్నాడు. వచ్చే వారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ లో రాహుల్ జాయిన్ అవ్వనున్నాడు. మరి ఎన్టీఆర్ కి ఫ్రెండ్ రోల్ అంటే ట్రైబ్ క్యారెక్టరే అయి ఉంటుంది. కాగా రాహుల్ సినిమా మొత్తం కనిపిస్తాడని.. ఎలాగూ సినిమాలో ఎక్కువ సీన్స్ ఎన్టీఆర్ వే.

    Also Read: ‘పవర్ స్టార్’ను మళ్ళీ వాడుకున్న వరుణ్ తేజ్ !

    కాబట్టి.. ఎన్టీఆర్ పక్కన ప్రతి సీస్ లో రాహుల్ ఉంటాడని.. ఆ రకంగా రాహుల్ ది కూడా సినిమాకే అతి ముఖ్యమైన రోల్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా ధృడంగా ఉండే కొమరం భీం రోల్ కోసం ఎన్టీఆర్ ఇప్పటికే లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు చేసి మరీ ఈ పాత్ర కోసం సన్నద్ధం అయ్యాడు కాబట్టి.. ఈ సినిమా కోసం తారక్ బాగానే కసరత్తులు చేశాడు. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె పై ఇప్పటికే షూట్ చేశారు.

    Also Read: ప్రభాస్ ‘ఆది పురుష్’.. ఇండియాలో ఇదే తొలిసారి !

    ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. కాగా సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అన్ని సాంగ్స్ కీరవాణి ఇప్పటికే పూర్తి చేశాడట. ఏది ఏమైనా ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి నుండి వస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు ఉన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్