‘చిరు – చరణ్’ సీన్స్ కు రంగం సిద్ధం !

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న ‘ఆచార్య’ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ పురాతన దేవాలయం సెట్ వేశారని.. వచ్చే వారం నుండి ఆ సెట్ లో చరణ్ – చిరు కాంబినేషన్ లోని సిన్స్ ను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ సీన్స్ ను గత నెలలోనే షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా ప్రవాహంలో చరణ్ కి కరోనా రావడంతో షూటింగ్ చేసే పరిస్థితి […]

Written By: admin, Updated On : January 19, 2021 5:56 pm
Follow us on


మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న ‘ఆచార్య’ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ పురాతన దేవాలయం సెట్ వేశారని.. వచ్చే వారం నుండి ఆ సెట్ లో చరణ్ – చిరు కాంబినేషన్ లోని సిన్స్ ను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ సీన్స్ ను గత నెలలోనే షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా ప్రవాహంలో చరణ్ కి కరోనా రావడంతో షూటింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది.

Also Read: ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ట్రైబ్ గా యంగ్ కమెడియన్ !

ఇక ఈ ‘ఆచార్య’ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా రాబోతున్నాడు. ఇక మెగాస్టార్ ను ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా కొరటాల ఈ సినిమాలో చూపించబోతున్నాడనగానే మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పైగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది.

Also Read: ‘పవర్ స్టార్’ను మళ్ళీ వాడుకున్న వరుణ్ తేజ్ !

ముఖ్యంగా దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకల పై పోరాటం చేసే ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. అన్నట్టు సారథి స్టూడియోలో మొదలయ్యే షూట్ లో కాజల్ కూడా పాల్గొనబోతుందట. ఆమె ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటిస్తోందని తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడట. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్