https://oktelugu.com/

Suma: ఆ షోలో సుమ బండారం బయటపెట్టిన రచ్చరవి.. ఏకంగా బూతులు తిడుతూ?

Suma: బుల్లితెర టాప్ యాంకర్ సుమ హోస్ట్ గా ప్రసారమవుతున్న షోలలో క్యాష్ షో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్ కు రచ్చ రవి, భద్రం, తాగుబోతు రమేష్, ఖయ్యుం కంటెస్టెంట్లుగా హాజరయ్యారు. సుమ రచ్చరవితో పచ్చి మిర్చి తిని దీనికి తగిన ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలని అడగగా రచ్చరవి వెరైటీ ఎక్స్ ప్రెషన్ ఇస్తారు. భద్రంకు సుమ వేపాకు ఇవ్వగా నేను రోజూ వేపాకు తింటానని భద్రం అన్నారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 20, 2022 / 04:48 PM IST
    Follow us on

    Suma: బుల్లితెర టాప్ యాంకర్ సుమ హోస్ట్ గా ప్రసారమవుతున్న షోలలో క్యాష్ షో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్ కు రచ్చ రవి, భద్రం, తాగుబోతు రమేష్, ఖయ్యుం కంటెస్టెంట్లుగా హాజరయ్యారు. సుమ రచ్చరవితో పచ్చి మిర్చి తిని దీనికి తగిన ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలని అడగగా రచ్చరవి వెరైటీ ఎక్స్ ప్రెషన్ ఇస్తారు. భద్రంకు సుమ వేపాకు ఇవ్వగా నేను రోజూ వేపాకు తింటానని భద్రం అన్నారు.

    Suma

    వేపాకు లేతగా ఉంటే బాగుంటుందని భద్రం చెప్పగా మన వయస్సును బట్టి వేపాకు ఇస్తున్నారని సుమ చెప్పుకొచ్చారు. సుమ తాగుబోతు రమేష్ కు చింతపండు ఇచ్చి దీనిపై ఈగల మందు కొట్టామని చెబుతారు. అలీ తమ్ముడు ఖయ్యుమ్ సుమ రెడ్ డ్రెస్ లో పెళ్లి కూతురులా ఉన్నారని చెప్పారు. డాండ్రఫ్ తగ్గాలంటే ఏం వాడాలని అడగగా నా హెయిర్ కు ఏం వాడలేదని తాను హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నానని రచ్చ రవి చెప్పారు.

    Also Read: RRR Collections: అన్నీ వందల కోట్లా ? బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది !

    రచ్చరవి కామెంట్లకు సుమ బదులిస్తూ నాటు నాటు అంటూ పాట పాడారు. నా లైఫ్ లో సుమతో తప్ప ఎవరితో మొట్టికాయలు తిననని రచ్చ రవి చెప్పగా నేను మాత్రం నిన్ను తప్ప ఎవరినైనా కొడతానంటూ సుమ బదులిచ్చారు. ఆ తర్వాత రచ్చ రవి కొంతసేపు పందికొక్కులా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రచ్చరవిని పందికొక్కు చూస్తే చచ్చిపోతుందంటూ తాగుబోతు రమేష్ కామెంట్ చేశారు.

    ఆ తర్వాత రచ్చ రవి ఇప్పటివరకు సుమ నన్ను ఒక్క ఎపిసోడ్ లో కూడా గెలిపించలేదని అన్నారు. సుమ పిచ్చి వాగుతావ్ అసలు అంటూ రివర్స్ లో కామెంట్ చేశారు. అక్కడ కూర్చుని ఎంతమందికి ఆన్సర్లు చెప్పావ్ అంటూ రచ్చరవి కామెంట్ చేయగా సుమ ఏమనుకుంటారు మీరు స్టుపిడ్, ఇడియట్ అంటూ షో చేయనని చెబుతారు. ఆ తర్వాత సుమ బూతులు తిడుతున్నట్టు ప్రోమో విడుదలైంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

    Also Read: Beast Collection: బీస్ట్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?

    Recommended Videos: