Ground water: సాధారణంగా ప్రజలు తాగునీటి కోసం భూగర్భ జలాలనే ఎక్కువగా వాడుతుంటారు. పట్టణాల్లో ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా మినరల్ వాటర్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చినా వాటికి కూడా భూగర్భ జలాలే ప్రధాన వనరు. ఈ నేపథ్యంలో దేశంలో ఏ రాష్ట్రంలోని భూగర్భ జలాలు సురక్షితంగా ఉన్నాయో అన్న విషయంపై కేంద్ర జలమంత్రిత్వశాఖ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోని భూగర్భజలాలే సురక్షితమని స్పష్టమైంది.
ఈ పరీక్షల కోసం గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న బోర్లు, బావుల నీటిని అధికారులు ప్రత్యేకంగా పరీక్షించారు. దేశవ్యాప్తంగా 47,03,476 తాగునీటి నమూనాలను పరీక్షించగా అందులో ఏపీ నుంచి 4,04,083 నమూనాలకు పరీక్షలు నిర్వహించారు. వీటిలో నాలుగు శాంపిళ్లలో మాత్రమే కాలుష్య కారకాలున్నట్లు స్పష్టమైంది. మొత్తం శాంపిళ్లలో 16,801 నమూనాల్లోనే కాలుష్య కారకాలకు సంబంధించి ఆనవాళ్లు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.
Also Read: Covid Fourth Wave: కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందా ? భయపెడుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్!
ఏపీలో దాదాపు రెండున్నర లక్షలకు పైగా బోర్లు, బావులతో పాటు 50వేలకు పైబడి ఉన్న మంచినీటి పథకాల ద్వారా అందించే నీటిని ఏడాదికి రెండుసార్లు చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఇక రూరల్ వాటర్ సప్లై పరిధిలో 107 వాటర్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఉండగా, వాటిలో 21 కలుషిత కారకాలను గుర్తించే అవకాశముంది. తాగునీటిలో పాదరసం ఆనవాళ్లుంటే నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. క్లోరైడ్ కారకాలుంటే బీపీ వంటి వ్యాధులకు గురవుతారు. లెడ్ వంటివి ఉంటే చిన్న పిల్లల్లో ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. అలాగే పెద్దల్లో అయితే కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. ఫ్లోరైడ్ కారణంగా కీళ్లవ్యాధులు రావడం, పళ్లు దెబ్బతినడం, ఎముకలు పెళుసుబారడం వంటి వ్యాధులకు లోనవుతారు.
అయితే ఏపీలో గతంలో నాలుగేళ్ల క్రితం వరకు ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఉండేవని.. వర్షాభావ పరిస్థితుల నుంచి ప్రస్తుతం రాష్ట్రం బయటపడటంతో ఆ ప్రభావం తగ్గిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోనూ భూగర్భ జలాల నాణ్యత పెరిగిందని వారు వెల్లడించారు. ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల్లో నీటి నాణ్యత చాలా మెరుగైనట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు.
Also Read:
BJP Focused On Khammam: ఆపరేషన్ కమలం: ఖమ్మంపై కాషాయ పార్టీ దృష్టి.. కేంద్ర మంత్రులు.. జాతీయ నేతల రాక
Recommended Videos