Raghuvaran Brother: కొందరు బై బర్త్ నటులేమో అనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటి పాత్ర చేసినా చాలా సహజంగా ఉంటుంది. అలాంటి అరుదైన నటుల్లో రఘువరన్ ఒకరు. వ్యక్తిగత కారణాలతో మద్యానికి బానిసై చిన్న వయసులోనే కన్నుమూశాడు. రఘువరన్ చావుకు గల కారణాలు ఇటీవల ఆయన తమ్ముడు వెల్లడించారు. చనిపోవడానికి ముందు రఘువరన్ మానసిక వేదన అనుభవించినట్లు చెప్పుకొచ్చాడు. రఘువరన్ తమ్ముడు మాట్లాడుతూ… అన్నయ్య మరణించిన రోజు నేను బెంగుళూరులో ఉన్నాను. ఆయనకు ఛాతి నొప్పిరావడంతో పనివాళ్ళు ఆసుపత్రికి తరలించారు.
కానీ అప్పటికే అన్నయ్య చనిపోయాడని రఘువరన్ తమ్ముడు చెప్పాడు. నేను అన్నయ్యతోనే ఉండేవాడిని. ఆయన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు తలెత్తాయి. మానసికంగా, శారీరకంగా అలసిపోయాడు. భార్యతో విబేధాల కారణంగా విడిపోయారు. కొడుకు అంటే అన్నయ్యకు ప్రాణం. కోర్టు అనుమతి ప్రకారం కేవలం శనివారం మాత్రమే తన వద్దకు వచ్చేవాడు. కొడుకును చూడగానే ఎంతో సంతోషపడేవాడు. మళ్ళీ ఆదివారం తిరిగి వెళ్లిపోతుంటే కుమిలిపోయేవాడు.
అన్నయ్య ముందుకు అలవాటు పడటానికి కూడా కొన్ని వ్యకిగత కారణాలు ఉన్నాయని… రఘువరన్ తమ్ముడు అన్నాడు. పరోక్షంగా భార్య రోహిణి ఆయన్ని మానసికంగా కృంగదీసిందని చెప్పాడు. ఇక గతంలో రఘువరన్ తో గొడవలకు కారణం ఆయన వ్యసనాలే అని రోహిణి చెప్పడం విశేషం. ఆయన మద్యం అలవాటును భరించలేకే విడిపోయినట్లు ఆమె చెప్పారు.
నటి రోహిణిని రఘువరన్ 1996లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రిషివరన్ అనే కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన నాలుగేళ్లకు 2004లో విడాకులు తీసుకుని విడిపోయారు. 2008లో రఘువరన్ మద్యానికి బానిసై అనారోగ్యంతో కన్నుమూశారు. రఘువరన్ జ్ఞాపకార్థం రోహిణి ఆయన స్వయంగా కంపోజ్ చేసి పాడిన పాటలను సీడీ చేసి విడుదల చేసింది. ఈ సీడీని సూపర్ స్టార్ రజినీకాంత్ స్వయంగా విడుదల చేశారు.