https://oktelugu.com/

Balakrishna: ఆ సినిమాలతో నాగార్జున ను స్టార్ గా చేసిన ఆ డైరెక్టర్ బాలకృష్ణ కు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చాడా..?

సినిమా ఇండస్ట్రీ లో ప్రతి హీరో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవడం కోసం డిఫరెంట్ కథలను ఎంచుకొని సినిమాలుగా చేస్తూ సక్సెస్ లను సాధించాలని చూస్తుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 15, 2024 / 01:50 PM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన సాధించిన విజయాల గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. డిఫరెంట్ జానర్లలో సినిమాలను చేస్తూ సక్సెసులు అందుకున్న ఆ తరం హీరోల్లో నాగార్జున మొదటి వరుసలో ఉంటాడు. నిజానికి రాఘవేంద్రరావుతో చేసిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు ఆయన్ని ఉన్నత స్థానంలో నిలిపాయనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటి వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలకృష్ణ కూడా చాలా మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే బాలకృష్ణ భైరవద్వీపం, ఆదిత్య 369 లాంటి డిఫరెంట్ జానర్లలో సినిమాలను ట్రై చేసి సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచాడు. కానీ ఒక దర్శకుడు మాత్రం నాగార్జునకి భారీ సక్సెస్ లను అందించి బాలకృష్ణ కి మాత్రం ఒక భారీ డిజాస్టర్ ను అందించారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తి రస ప్రాధాన్యమున్న సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. అదే రాఘవేంద్రరావు బాలకృష్ణకి పాండురంగడు సినిమాతో ఒక భారీ ఫ్లాప్ నైతే ఇచ్చాడు. అలా రాఘవేంద్ర రావు ఈ విషయం సమన్యాయం చేయలేకపోయాడు.

    ఇక పాండురంగడు సినిమాలో బాలయ్య బాబు కొంచెం నెగిటివ్ టాక్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు. అందువల్లే ఆ సినిమా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. ఇక ఈ కాంబినేషన్ లో మరోసారి పౌరాణికానికి సంబంధించిన ఏదైనా సినిమా వస్తుందేమో అంటూ చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అది వర్కౌట్ అవ్వదు… ఎందుకంటే రాఘవేంద్ర రావు ఇప్పుడు సినిమాలు చేయకుండా ఖాళీగా రెస్ట్ తీసుకుంటున్నారు.

    కాబట్టి ఇక వీళ్ళ కాంబో లో సినిమా రావడం అనేది అసాధ్యమనే చెప్పాలి. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు రాఘవేంద్ర రావు తనకు ఫ్లాప్ ఇచ్చిన కూడా బాపు డైరెక్షన్ లో ‘శ్రీ రామరాజ్యం’ అనే సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ సక్సెస్ తో వాళ్ళ నాన్న అయిన నందమూరి తారక రామారావు గారు అప్పట్లో రాముడు వేషంలో ఎలా అయితే మెప్పించాడో, ఇప్పుడు బాలయ్య బాబు కూడా తన నటనతో ప్రేక్షకులందరిని కట్టిపడేశాడు.

    ఇక స్క్రీన్ మీద రాముడిని చూస్తున్నామా అనెంతలా జనాన్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లాడు అంటే బాలయ్య బాబు ఆ పాత్రలో ఎంత లీనమైపోయి నటిస్తున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు…ఇక మొత్తానికైతే ఇప్పుడు బాలయ్య బాబు డిఫరెంట్ సినిమాలను చేయకుండా కమర్షియల్ సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే ఇప్పటికీ కూడా ఒక డిఫరెంట్ జానర్ లో ఉన్న సినిమా స్టోరీ ని బాలయ్య బాబు దగ్గరికి తీసుకెళ్తే తప్పకుండా బాలయ్య ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనేది వాస్తవం…