Homeఎంటర్టైన్మెంట్భయపెట్టేలా మారిపోయిన హీరో !

భయపెట్టేలా మారిపోయిన హీరో !

Durga First Lookఈ ఫోటోలో అఘోరాగా కనిపిస్తోంది ఒక హీరో అని తెలిసి నెటిజన్లు ఒళ్ళు గగుర్పొడిచింది. ఏమిటి.. హీరోనా ? ఎవరు ఆ హీరో..? వైవిధ్యానికి పర్యాయపదం ఆ హీరో. ఎవరై ఉంటారు ఆ హీరో.. ‘రాఘవ లారెన్స్‌’. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి.. డ్యాన్సర్ గా ఎదిగి.. దర్శకుడిగా సూపర్ సక్సెస్ అందుకొని.. ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న నిఖార్సయిన మల్టీ టాలెంటెడ్‌ పర్సన్ ‘రాఘవ లారెన్స్‌’.

సహజంగా ప్రేక్షకులను భయపెట్టడమే తన సక్సెస్ గా మార్చుకున్న రాఘవ లారెన్స్‌, ఇలాంటి లుక్ లో ఒక సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అఘోరా కూడా ఇంకా సాఫ్ట్ గా కనిపిస్తాడేమో. కానీ, లారెన్స్ మాత్రం ఈ లుక్ లో అఘోరాలనే భయపెట్టేలా ఉన్నాడు. ఇంతకీ ఈ పోస్టర్ ఏ సినిమాలోది అంటే.. లారెన్స్ ప్రస్తుతం చేస్తోన్న ‘దుర్గ’ సినిమాలోది.

రాఘవ లారెన్స్ ఈ సినిమా ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ లుక్‌ పోస్టర్స్‌ ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసిన వెంటనే.. ఇవి వైరల్ గా మారాయి. పోస్టర్ లో లారెన్స్ అఘోరా వేషంలో కనిపించడంతో అందరికీ ఆసక్తి కలిగింది. మొత్తానికి ఈ పోస్టర్‌ ను చూస్తుంటే.. ఈ సినిమా కూడా లారెన్స్ తనకు బాగా కలిసొచ్చిన హారర్‌ నేపథ్యంలోనే తీస్తున్నట్లు అనిపిస్తోంది.

అయితే, ఈ సినిమాలో రాఘవ నటిస్తూ.. స్క్రిప్ట్ రాస్తున్నా.. దర్శకత్వ బాధ్యతల జోలికి మాత్రం వెళ్లలేదు. త్వరలోనే ఈ సినిమాకి దర్శకత్వం వహించే దర్శకుడి పేరును కూడా అధికారికంగా ప్రకటిస్తామని లారెన్స్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే లారెన్స్ ‘ముని, కాంచన, గంగ(కాంచన 2), కాంచన 3’ వంటి సినిమాలతో హారర్ నేపథ్యంలో తిరుగులేని హీరోగా వరుస సక్సెస్ లు అందుకున్నాడు. కాబట్టి, ఈ కొత్త హారర్ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉండే అవకాశం ఉంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version