Raghava Lawrence Daughter Debut: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఒక గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ ని మొదలు పెట్టి , ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారి ఎన్నో సంచలనాత్మక పాటలను మనకి అందించిన రాఘవ లారెన్స్ నేడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ని డ్యాన్స్ విభాగం నేటి తరం ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసేలా చేసింది రాఘవ లారెన్స్ మాత్రమే. ఆ స్థాయిలో కొరియోగ్రాఫర్ గా ఇండియా లోనే టాప్ 2 లో ఒకరిగా నిలిచాడు లారెన్స్. కొరియోగ్రాఫర్ గా ఐకాన్ గా నిల్చిన ఆయన, ఆ తర్వాత అక్కినేని నాగార్జున ని హీరో గా పెట్టి ‘మాస్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఆ తర్వాత లారెన్స్ కాంచన సిరీస్ కి దర్శకత్వం వహించాడు.
ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా ఒకపక్క హీరోగా, మరో పక్క డైరెక్టర్ గా విజయం సాధించి , ఆల్ రౌండర్ అని అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరో గా బెంజ్ అనే చిత్రం చేస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ శిష్యుడు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం తో పాటు ‘కాంచన 4’ కూడా చేస్తున్నాడు , కాళభైరవుడు అనే చిత్రం కూడా లైన్ లో ఉంది. ఇలా హీరోగా ఆయన వరుస చిత్రాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు లారెన్స్ కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే లారెన్స్ తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్ ని హీరో గా పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు తన కూతురు రాఘవి ని కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నాడు. అయితే నటిగా మాత్రం కాదు , దర్శకురాలిగా పరిచయం చేయబోతున్నాడు.
సాధారణంగా , ఎంత పెద్ద స్టార్ కొడుకు లేదా కూతురు అయినా డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోవడం ఇప్పటి వరకు జరగలేదు. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి , ఆ తర్వాత డైరెక్టర్ గా వెళ్లేవారు. కానీ తన కూతురు రాఘవి ని మాత్రం నేరుగా డైరెక్టర్ గానే పరిచయం చేయబోతున్నాడు లారెన్స్. ఈ చిత్రానికి ఆయన స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు అట. ఇది వరకే రాఘవి కి అమెరికా లో ప్రత్యేకంగా డైరెక్షన్ విభాగం లో కోచింగ్ కూడా ఇప్పించాడట లారెన్స్. మంచి అనుభవం కూడా ఆమె సంపాదించింది. అందుకే ఈ రిస్క్ తీసుకోబోతున్నాడని సమాచారం. అయితే ఈ చిత్రం లో నటీనటులు ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ , మరి కొన్నిరోజులు ఆగాల్సిందే.
