Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీకి అన్ని కోట్లు ఇవ్వడంలో అర్థం ఉంది.. ఎందుకంటే..

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీకి అన్ని కోట్లు ఇవ్వడంలో అర్థం ఉంది.. ఎందుకంటే..

Vaibhav Suryavanshi: 15 సంవత్సరాల వయసులో ఒక బాలుడు ఈ స్థాయిలో ఐపీఎల్ మీద తన ముద్ర వేస్తాడని ఎవరు కూడా కలలో ఊహించరు. ఎందుకంటే ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్లో ఆ స్థాయిలో పరుగులు చేయడం అంత ఈజీ కాదు. కానీ సూర్య వంశీ దానిని చేసి చూపించాడు. అంతేకాదు, పరుగుల వరద ఎలా పారించాలో లైవ్లో చూపించాడు.

వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ నుంచి మొదలు పెడితే ఎమర్జింగ్ ప్లేయర్ వరకు అన్ని అవార్డులు సొంతం చేసుకున్నాడు. దీని ద్వారా కోట్ల డబ్బు సంపాదించాడు. దీంతో చాలామంది సూర్య వంశీ గొప్ప గొప్ప భవనాలు కడుతున్నాడు.. భారీగా ఎదిగిపోయాడు అనుకుంటున్నారు. కానీ సూర్య వంశీ ఉంటున్న ఇల్లు అత్యంత సాదాసీదాగా ఉంది. ఐపీఎల్ లో అతడు సత్తా చూపించిన తర్వాత.. సొంత రాష్ట్రమైన బీహార్ వెళ్ళిపోయాడు.

బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా తాజాపూర్ లో అతడికి సొంత ఇల్లు ఉంది. ఐపీఎల్ తర్వాత అతడు సొంత ఇంటికి రావడంతో స్థానికులు అతడిని చూసేందుకు వెళ్లారు. అతడితో ఫోటోలు దిగారు. రాజకీయ నాయకుల నుంచి మొదలుపెడితే క్రికెటర్ల వరకు ఈ జాబితాలో ఉన్నారు. అయితే వారు దిగిన ఫోటోలలో సూర్య వంశీ ఇల్లు అత్యంత సాధారణంగా ఉంది. ఆధర్ కూడా మామూలు డ్రెస్ లోనే కనిపించాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

సూర్య వంశీ కి రాజస్థాన్ యాజమాన్యం ఆ స్థాయిలో డబ్బు ఇవ్వాల్సిందనని వారు చెబుతున్నారు. సూర్య వంశీది మామూలు కుటుంబమని.. అతడు గొప్పగా ఆడటం వల్ల రాజస్థాన్ జట్టు విలువ పెరిగిందని.. రేటింగ్స్ కూడా అధికంగా వచ్చాయని.. అలాంటప్పుడు అతడికి కృతజ్ఞతగా రాజస్థాన్ యాజమాన్యం ఉండాలని అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు అభిమానులను కలిసిన తర్వాత సూర్య వంశీ బెంగళూరు వెళ్ళిపోయాడు. అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటాడని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version