బహుశా సల్మాన్ ప్లేస్ లో మరో హీరో ఉంటే, కచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోడు. కానీ సల్మాన్ కి తన కెరీర్ గ్రాఫ్ కంటే కూడా, నిర్మాతలు సేఫ్ గా ఉండటమే ఎక్కువ ఇంట్రస్ట్. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికే బాలీవుడ్ మీడియా క్లారిటీ ఇచ్చింది. కాగా ‘రాధే’ సినిమాని జీ స్టూడియోస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమాని అటు థియేటర్లోనూ, ఇటు జీ ప్లెక్స్ కి చెందిన స్ట్రీమింగ్ సైట్ లో ‘పే పర్ వ్యూ’ పద్దతిలో ఒకేసారి వచ్చేనెల రంజాన్ పండుగ స్పెషల్ గా గ్రాండ్ గా విడుదల కాబోతుంది, ఇక సల్మాన్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు.
మరి వారి ఎదురుచూపులు ఫలించేలా సినిమా ఉంటుందో లేదో చూడాలి. అయితే, ఇలా పెద్ద సినిమాలను కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద నేరుగా రిలీజ్ చేస్తే.. అది థియేటర్స్ వ్యవస్థకే ప్రమాదం అని, అయినా.. పెద్ద సినిమాలు రెవిన్యూ పరంగా సేఫ్ గా ఉండాలి అంటే.. కచ్చితంగా థియేటర్స్ రిలీజ్ అయితేనే న్యాయం జరుగుతుందని ట్రేడ్ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఒకపక్క దేశమంతా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ టైంలో పెద్ద సినిమాలని విడుదల చేయకూడదనే అన్ని పెద్ద సినిమాలు వాయిదా బాట పట్టాయి.
ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో థియేటర్లు కూడా మూతపడ్డాయి. మళ్ళీ ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయో తెలీదు. కాబట్టి.. సల్మాన్ ఖాన్ నెలలు తరబడి థియేటర్స్ కోసం వెయిట్ చెయ్యకూడదని… జీ ప్లెక్స్ ఆన్లైన్ విడుదలకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇక సల్మాన్ సినిమా మొదటి షో చూడాలి అనుకుంటే.. జీ ప్లెక్స్ లో ఆన్లైన్ మెథడ్ లో థియేటర్ టికెట్ డబ్బులు కట్టి చూడాలి.