బన్నీ నాన్చడం మంచిది కాదు.. బాధలో దిల్ రాజు !

అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఒక అలవాటు ఉంది. ఆ హీరో ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. ఒకసారి కథ ఒప్పుకున్న తరువాత మళ్ళీ ఇన్ వాల్వ్ అవ్వకూడదు అనుకుంటారు. అందుకే కథ ఒప్పుకున్నే ముందు హీరోలను ఒకటికి నాలుగు సార్లు కథ నచ్చిందా ? మార్పులు ఏమైనా చేయించాలా ? మీ క్యేరెక్టర్ విషయంలో మీరు హ్యాపీగా ఉన్నారా ? లేదా ? ఇలా ప్రతి స్టార్ హీరోను అడగడం దిల్ రాజు ఆనవాయితీ. […]

Written By: admin, Updated On : April 22, 2021 1:22 pm
Follow us on

అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఒక అలవాటు ఉంది. ఆ హీరో ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. ఒకసారి కథ ఒప్పుకున్న తరువాత మళ్ళీ ఇన్ వాల్వ్ అవ్వకూడదు అనుకుంటారు. అందుకే కథ ఒప్పుకున్నే ముందు హీరోలను ఒకటికి నాలుగు సార్లు కథ నచ్చిందా ? మార్పులు ఏమైనా చేయించాలా ? మీ క్యేరెక్టర్ విషయంలో మీరు హ్యాపీగా ఉన్నారా ? లేదా ? ఇలా ప్రతి స్టార్ హీరోను అడగడం దిల్ రాజు ఆనవాయితీ. అందుకే హీరోలు కూడా రాజుగారి సినిమా అనగానే.. స్క్రిప్ట్ లో ఎక్కువుగా ఇన్ వాల్వ్ అవ్వరు.

కానీ ఒక హీరో మాత్రం తెగ ఇన్ వాల్వ్ అయిపోతున్నాడట, పైగా ఆ హీరోతో పాటు ఆ హీరోగారి కుటుంబంతో కూడా రాజుగారికి చక్కని అనుబంధం ఉంది, సో.. అతగాడు ఎక్కువుగా స్క్రిప్ట్ ను కెలుకుతున్నా ఇన్నాళ్లు ఒప్పిక పట్టారట. కానీ డేట్లు ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా.. అనవసరంగా బాగున్న స్క్రిప్ట్ ను చెడగొడుతూ.. తన జడ్జ్ మెంట్ నే అవమానిస్తూ ఉన్న ఆ హీరో పై దిల్ రాజు పూర్తి అసంతృప్తిగా ఉన్నాడట. మరి ఆ హీరో ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

అయితే ఆ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. బన్నీ పై తీవ్ర అసంతృప్తితో దిల్ రాజు ఉన్నాడని అంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమాను అనౌన్స్ చేసి ఇప్పటికే రెండేళ్లు కావొస్తోంది. అంతకు ముందు రెండేళ్ల నుండి ఆ సినిమా స్క్రిప్ట్ పై కూర్చోవడం జరిగింది. అంటే సుమారు ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడ్డారు. ఇంత కష్టపడి ఒక సినిమాని తీయాలనుకుంటే.. అల్లు అర్జున్ మాత్రం ఏ విషయం తేల్చట్లేదట.

నిజానికి బన్నీ ఒప్పుకున్నాకే సినిమాను అనౌన్స్ చేసారు , కానీ బన్నీ మాత్రం సినిమాకు డేట్స్ ఇవ్వట్లేదని.. పైగా సినిమా చెయ్యను అని కూడా చెప్పట్లేదు అని.. మొత్తానికి బన్నీ, తన టైంను వేస్ట్ చేస్తూ.. కాలక్షేపం చేస్తున్నాడని దిల్ రాజు ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బన్నీ వెర్షన్ మరోలా ఉంది. ఐకాన్ స్క్రిప్ట్ లో కొన్ని లొసుగులు ఉన్నాయట. అందుకే దిల్ రాజు అడిగితే చూద్దాం, చేద్దాం అనే అంటున్నాడట. అయినా కథ నచ్చకపోతే చెయ్యను అని చెప్పాలి. అంతేకాని ఇలా నాన్చడం మంచింది కాదు.