Radhe Shyam vs Bheemla Nayak Box Office Collections: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ప్రభాస్ సినిమా సక్సెస్‌తో ‘రాధేశ్యామ్’ వేడుకులు చేసుకుంటుంది. మరోపక్క టీం స్పెషల్ ట్రీట్ ఇచ్చి మరీ తమ ఆనందాన్ని పంచుకుంటుంది.

అయితే, ‘రాధేశ్యామ్’ వర్సెస్ ‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ విషయానికి వస్తే.. భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దంచికొట్టింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆంధ్ర లో లో టికెట్ రేట్ల కారణంగా దెబ్బ పడినా నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ తో రచ్చ చేసింది ‘భీమ్లా నాయక్’.
కానీ ‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ కంటే.. ‘రాధేశ్యామ్’కి ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో ‘భీమ్లా నాయక్’ రూ. 19.80 కోట్ల షేర్ రాబడితే, ‘రాధేశ్యామ్’ రూ. 23.14 కోట్లు వసూలు చేశాడు. పుష్ప రూ. 16.70 కోట్లతో మూడో ప్లేస్‌లో ఉంది.

ఓవరాల్ గా ‘భీమ్లా నాయక్’ మొదటి రోజు సినిమా 26 కోట్ల నుండి 27 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ‘రాధేశ్యామ్’ విషయానికి వస్తే.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 46 కోట్ల నుండి 47 కోట్ల రేంజ్ షేర్ అందుకోనుంది. మొత్తమ్మీద ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తే.. ‘రాధేశ్యామ్’ అంతకన్నా గొప్ప విజయాన్ని సాధించింది.

[…] Megastar Chiranjeevi Shruti Haasan Movie: శృతిహాసన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ కు చెక్కేయడంతో తెలుగులో సినిమాలు కొద్దిగా తగ్గాయి. కాగా మళ్లీ క్రాక్ లాంటి హిట్ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ హిట్ తో ఇప్పుడు ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. […]