Radhe Shyam US Review: తారాగణం : ప్రభాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, సత్యరాజ్, సచిన్ ఖేదేకర్, భాగ్యశ్రీ తదితరులు.
దర్శకత్వం : కె.రాధాకృష్ణ,
ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస,
కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు,
సంగీతం, నేపధ్య సంగీతం: జస్టిన్ ప్రభాకరన్,
నిర్మాతలు : భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్.

Radhe Shyam US Review
హాలీవుడ్ మేకర్స్ కూడా షాక్ అయ్యేలా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందింది ప్రభాస్ ‘రాధేశ్యామ్’. కాగా ఈ సినిమా ఫస్ట్ యూఎస్ రివ్యూ వచ్చేసింది. ఇతర దేశాల్లో ఇప్పుడే ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు విజిల్స్ తో కేకలతో ఊగిపోతున్నారు. ప్రేక్షకుల్లో ఎక్కువమంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. ‘రాధేశ్యామ్’ ప్రపంచస్థాయి సినిమా అని.. సింపుల్ గా ‘రాధేశ్యామ్’ హాలీవుడ్ రేంజ్ సినిమా అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
కథ :
విక్రమాదిత్య (ప్రభాస్) లండన్ లో ఫేమస్ పామిస్ట్. విక్రమాదిత్య భారత్ లో పుట్టినా చిన్నతనంలోనే ఫ్యామిలీతో లండన్ వెళ్లాల్సి వస్తోంది. అయితే, అతనికి జాతకం చెప్పడం చిన్నతనం నుంచి ఉన్న అలవాటు. ఆ అలవాటు కారణంగానే విక్రమాదిత్య లండన్ లో బాగా ఫేమస్ అవుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య విక్రమాదిత్య (ప్రభాస్), ప్రేరణ (పూజా హెగ్డే) ను చూసి ప్రేమలో పడతాడు. మరి ఆమె ప్రేమను గెలుచుకోవడానికి విక్రమాదిత్య ఏమి చేశాడు ? అసలు వీరి ప్రేమలో వచ్చిన సమస్య ఏమిటి ? వీరి ప్రేమకు పరమహంస (కృష్ణం రాజు) ఎలా ఉపయోగ పడ్డారు ? అసలు 106 మంది ప్యాసింజర్లతో రోమ్ కి బయలుదేరిన ట్రైన్ కి.. విక్రమాదిత్య – ప్రేరణ ప్రేమకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
నటి నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా ప్రభాస్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. దాంతో ‘రాధేశ్యామ్’ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. రెబల్ స్టార్ ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. మాచో వారియర్ లుక్ నుంచి స్టైలిష్ లవర్ బాయ్ లుక్ లోకి ప్రభాస్ మారిన విధానం, ఆ లుక్ కోసం ప్రభాస్ పడిన కష్టం గురించి మెచ్చుకోవాల్సిందే.
మొత్తానికి ప్రభాస్ ‘రాధేశ్యామ్’కి తన తరపున చేయగలిగినంత చేసాడు. ఇక పూజా హెగ్డే కూడా ప్రేరణ పాత్రలో ఒదిగిపోయింది.. ఈ సినిమాలో ఉన్న లార్జ్ స్టార్ కాస్ట్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గ, క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ -పూజల కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది.

ఇక కథ విషయానికి ఇది ఒక యూనిక్ సబ్జెక్టు. అలాగే ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ వండర్. ఈ క్లైమాక్స్ ను ముందే ఏ ప్రేక్షకుడు ఊహించలేడు. అసలు ఈ ఊహించని రీతిలో క్లైమాక్స్ ను డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే.
Also Read: Radhe Shyam- RRR Movie: మార్చి మొత్తం ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ హడావుడే
అలాగే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ డ్రెస్సింగ్.. యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. క్లాస్ లో అలాగే స్టైల్ లో ప్రభాస్ ను బీట్ చేసే వారు లేరని.. ప్రభాస్ మరోసారి ఘనంగా నిరూపించాడు. మొత్తమ్మీద ఈ చిత్రం క్లాసిక్.. స్టైలిష్.. థ్రిల్లింగ్.. మిస్టరీ అండ్ రొమాంటిక్’ గా సాగుతూ ‘రాధేశ్యామ్’ అబ్బుర పరుస్తోంది.
తీర్పు :
సాంకేతికంగా ఈ సినిమా మాస్టర్ పీస్. యాక్షన్ సన్నివేశాలతో పాటు విజువల్స్ హాలీవుడ్ సినిమా స్థాయిలో అదిరిపోయాయి. తెలుగు తెరపై ఇలాంటి ఎమోషనల్ లవ్ యాక్షన్ సీన్స్ ఇప్పటివరకు చూడలేదు. ఇక ఈ సినిమా ముగింపు తెలుగులో ఊహించుకోవడం కూడా కష్టమే. అందుకే ఊహను నిజం చేసింది ‘రాధేశ్యామ్’. ఒక్క మాటలో డోంట్ మిస్ ఇట్.
Also Read: Radhe Shyam Movie Review: ‘రాధేశ్యామ్’ రివ్యూ : సినిమాలో మెయిన్ హైలైట్స్ ఇవే
