https://oktelugu.com/

Radhe Shyam: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు అభిమానులే అతిథులు?

Radhe Shyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఓ పీరియాడికల్ లవ్​ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్​ భవిష్యత్తును చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్​, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్​ చేశాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 11:03 AM IST
    Follow us on

    Radhe Shyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఓ పీరియాడికల్ లవ్​ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్​ భవిష్యత్తును చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్​, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్​ చేశాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కాగా, ఇటీవలే సంచారి పాటలో మరో రికార్డుకు తెరలేపారు ప్రభాస్​. నెట్టింట్లో మిలియన్ల వ్యూస్​తో దూసుకుపోతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రానున్న సంగతి తెలిసిందే.

    Radhe Shyam

    Also Read: ఆర్ఆర్ఆర్ అలా.. రాధేశ్యామ్ ఇలా.. మధ్యలో భీమ్లానాయక్.. ఎవరికి కలిసివస్తుంది?

    ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్​పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అసలు ఈ ఈవెంట్​ ఎక్కడ జరుగుతుంది?. అతిథులు ఎవరొస్తారు అని ఆతృతగా ఉన్నారు. కాగా, తాజాగా సమాచారం ప్రకారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​కు అతిథులుగా అభిమానులేనంట. డిసెంబరు 23న రామోజీ ఫిల్మ్​ సిటీలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ వేడుకను ప్లాన్​ చేశారు. ఈ కార్యక్రమంలోనే 5 భాషలకు చెందిన ట్రైలర్​ను విడుదల చేయనున్నారు మేకర్స్​. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్​ ఫ్యాన్స్ అంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు. వాళ్ల చేతులమీదుగానే సినిమా ట్రైలర్​ విడుదల చేయనున్నట్లు సమాచారం. జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.

    కాగా, ఈ సినిమాతో పాటు, ప్రభాస్​ సలార్​, ఆదిపురుష్​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ పూర్తయింది. ఇందులో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్​. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

    Also Read: పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్​కు​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడో తెలుసా?