https://oktelugu.com/

Akhanda Collections: అఖండ 15 రోజుల కలెక్షన్స్.. బాలయ్య కెరీర్ లోనే తొలిసారి ఇలా..

Akhanda: బాలయ్య కెరీర్ లో మరొక చెప్పుకోదగ్గ సినిమాల్లో ఈ మధ్య విడుదల అయినా అఖండ సినిమా ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి అతియసోక్తి లేదు.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమాతో బాలయ్య తన కేరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో బాలయ్య ఎప్పుడు ఇంత పెద్ద విజయాన్ని అందుకోలేదు. దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కూడా సూపర్ […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 18, 2021 / 11:01 AM IST
    Follow us on

    Akhanda: బాలయ్య కెరీర్ లో మరొక చెప్పుకోదగ్గ సినిమాల్లో ఈ మధ్య విడుదల అయినా అఖండ సినిమా ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి అతియసోక్తి లేదు.. బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమాతో బాలయ్య తన కేరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ మధ్య కాలంలో బాలయ్య ఎప్పుడు ఇంత పెద్ద విజయాన్ని అందుకోలేదు. దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Akhanda

    బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కూడా సూపర్ హిట్ అవవడంతో వీరి కాంబో మరొకసారి తిరుగులేనిది అని నిరూపించుకుంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య తన కెరీర్ లోనే తొలిసారి 100 కోట్ల గ్రాస్ ను టచ్ చేసారు. బోయపాటి యాక్షన్ ఎలివెంట్ కు బాలయ్య గర్జన మిక్స్ అయ్యి బాక్సాఫీస్ బద్దలు కొట్టే కెలెక్షన్స్ వస్తున్నాయి.

    విడుదల అయినా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అందుకున్న అఖండ ఓవర్శిస్ లో సైతం మంచి వసూళ్లు సాధించింది. అఖండ విడుదల అయినా 8 రోజుల్లోనే ఓవర్శిస్ లో కలెక్షన్ల సునామీ సృష్టించి అందరిని ఆశ్చర్య పరిచింది. రెండో వారం కూడా పర్వాలేదనిపించి ఇప్పుడు మూడవ వారంలోకి ఎంటర్ అయ్యింది. మొన్న గురువారం తో అఖండ రిలీజ్ అయ్యి 15 రోజులు పూర్తి చేసుకుంది.

    Also Read: Rakul preeth: పాత్ర డిమాండ్ చేసింది కదా అని.. ఆ తప్పు మాత్రం చేయను- రకుల్​

    ఈ సినిమా 15 రోజుల రన్ టైం లో 10 కోట్లకు పైగా లాభాలు అందుకుని ఇంకా ముందుకు వెళ్తుంది. అఖండ 15 రోజులలో 64 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకుంది. దీంతో 10 కోట్లకు పైగానే ప్రాఫిట్ అందుకుంది. ఈ సినిమా ఇంత భారీ హిట్ అవ్వడంతో టీమ్ అంత సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అదే జోష్ లో మరొక సినిమా కూడా స్టార్ట్ చేసాడు. యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసాడు. వచ్చే ఏడాది జనవరి 20 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇందులో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండడం విశేషం.

    Also Read: Three Heroes: ఆ ముగ్గురు స్టార్స్ కి గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన 2021

    Tags