Radhe Shyam OTT Announcement: ఓటీటీలోకి ‘రాధేశ్యామ్’.. అధికారిక ప్రకటన వచ్చేసింది !

Radhe Shyam OTT Announcement: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేసింది అంటూ ఫ్యాన్స్ చెప్పుకోవడానికి బాగుంది గానీ, వాస్తవానికి వాస్తవిక లెక్కలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా పర్ఫెక్ట్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ ఈ సినిమాని బతికించడానికి తమ భుజానికెత్తుకున్నారు ప్రభాస్ అభిమానులు. కానీ, లెక్కల వ్యవహారంలో భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో ‘రాధేశ్యామ్’ అడ్డంగా దొరికిపోయి మొత్తానికి నష్టాలు చూశాడు. ఇక ‘రాధేశ్యామ్’ తాజాగా […]

Written By: Shiva, Updated On : March 28, 2022 6:31 pm
Follow us on

Radhe Shyam OTT Announcement: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేసింది అంటూ ఫ్యాన్స్ చెప్పుకోవడానికి బాగుంది గానీ, వాస్తవానికి వాస్తవిక లెక్కలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా పర్ఫెక్ట్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ ఈ సినిమాని బతికించడానికి తమ భుజానికెత్తుకున్నారు ప్రభాస్ అభిమానులు. కానీ, లెక్కల వ్యవహారంలో భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో ‘రాధేశ్యామ్’ అడ్డంగా దొరికిపోయి మొత్తానికి నష్టాలు చూశాడు.

Radhe Shyam

ఇక ‘రాధేశ్యామ్’ తాజాగా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాడు. అమెజాన్‌ ప్రైమ్ తన ట్విటర్‌ ఖాతాలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అప్ డేట్ ఇచ్చింది. ఏప్రిల్‌ 1వ తేదీన రాధేశ్యామ్‌ ఓటీటీలోకి రానుంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథగా వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే అస్ట్రాలజర్‌గా కనిపించాడు. పూజ డాక్టర్‌ ప్రేరణగా నటించింది. అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్యాన్ ఇండియా చిత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.

Also Read: Parugu Heroine Sheela Kaur: ‘పరుగు’ హీరోయిన్ ఇప్పుడే పరిస్థితుల్లో ఉందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

మొత్తానికి ఈ లెక్కల వ్యవహారంలో భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో ‘రాధేశ్యామ్’ అడ్డంగా దొరికిపోయాడు. విడుదలైన అన్ని చోట్ల నేటితో కలెక్షన్స్ సగానికి తక్కువగా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ స్థాయిలో 7000 స్క్రీన్ లలో విడుదల అయినప్పటికీ.. గట్టిగా వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది.

‘రాధే శ్యామ్’కి దాదాపు 196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ కావాలి అంటే.. 200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని గట్టిగా 82.88 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. మరి ఈ సినిమా వల్ల మొత్తానికి మేకర్స్ 100 కోట్ల వరకు నష్టపోయారు. ఏది ఏమైనా రాధే శ్యామ్ పరిస్థితి ఊహించిన దానికంటే దారుణంగా తయారైంది.

Also Read: Andhra Pradesh MP Vs SP: ఏకంగా ఎస్పీ స్థలానికే ఎసరు పెట్టిన ఎంపీ.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో..?

పేరుకు మాత్రం ఈ అత్యంత భారీ అంచనాలతో అద్భుతమైన విజువల్స్ తో మరియు భారీ తారాగణంతో తెరకెక్కింది ఈ చిత్రం అంటూ హడావుడి చేశారు. చివరకు ఆ హడావుడి మేరకు కూడా కలెక్షన్స్ రాలేదు.

Recommended Video:

Tags