Radhe Shyam Box Office Collection: ప్రభాస్ అంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. ఒకప్పుడు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అయిన ప్రభాస్.. బాహుబలితో నేషనల్ హీరో అయిపోయాడు. దాంతో అతని మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. బడ్జెట్ వందల కోట్లు దాటేసింది. ఇప్పుడు రాధేశ్యామ్ ఎన్నో అంచనాల నడుమ, వందల కోట్ల బడ్జెట్ తో వచ్చింది. కానీ దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
దాంతో ఆరు రోజుల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ సారి చూద్దాం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన రాధేశ్యామ్.. మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఐదు భాషల్లో వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఓ రేంజ్‌లో జరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి 202.80 కోట్ల బిజినెస్ జరిగింది.
Also Read: జయలలిత, శోభన్ బాబు కూతురుని నేనే.. ఆధారాలు ఉన్నాయంటున్న మహిళ..
బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.204కోట్లు నమోదైంది. కానీ ఆరోజు రోజుల్లో దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. ఆరు రోజుల్లో కలిపి రూ.78.40 కోట్లు షేర్ వచ్చింది. దాంతో పాటు రూ.140.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది రాధేశ్యామ్. ఆరో రోజు మాత్రం రూ.64లక్షల షేర్‌ను వసూలు చేయగా.. రూ.1.5కోట్ల గ్రాస్‌ను తెచ్చుకుంది.
అయితే రోజు రోజుకూ రాధేశ్యామ్ కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. మొదటి నుంచి ప్లాప్ టాక్ కంటిన్యూ కావడంతో భారీ దెబ్బ పడిపోయింది. ఇంకో రూ.125.60 కోట్లు వస్తేనే రాధేశ్యామ్ హిట్ టాక్ కిందకు వస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే డార్లింగ్ ఇమేజ్‌ను ఇది భారీ దెబ్బ కొట్టేసింది.
దీనికంటే ముందు రిలీజ్ అయిన అఖండ, పుష్ప మూవీలు కలెక్షన్లతో దుమ్ము లేపాయి. ఈ రెండు సినిమాలు 11 రోజుల పాటు కోటి పైగా షేర్ వసూలు చేశాయి. అటు భీమ్లా నాయక్ కూడా ఆరు రోజుల వరకు రూ.కోటి వరకు షేర్‌ను వసూలు చేసింది. కానీ రాధే శ్యామ్ ఐదు రోజుల వరకే రూ.కోటి షేర్‌ను వసూలు చేసింది.
Also Read: ప్చ్.. పవన్ ‘భగత్ సింగ్’లో బూతు సిరీస్ నటుడు