Radhe Shyam AP & Telangana Collections: విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘రాధేశ్యామ్’ సినిమా అద్భుతమైన టాక్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ లో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్ లలో విడుదల అయిన ‘రాధేశ్యామ్’ చాలా చోట్ల బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొదటి రోజు రూ.66 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.

Radhe Shyam AP & Telangana Collections
ఏపీ & తెలంగాణలో ‘రాధేశ్యామ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ :
నైజాం – 19.40 కోట్లు
సీడెడ్ – 11.46 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.35 కోట్లు
గుంటూరు – 5.70 కోట్లు
ఈస్ట్ గోదావరి – 6.43 కోట్లు
వెస్ట్ గోదావరి – 4.60 కోట్లు
కృష్ణ – 4.51 కోట్లు
నెల్లూరు – 4.56 కోట్లు
Also Read: Radhe Shyam Heroine Pooja Hegde’s Cute Pictures
తొలిరోజే ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం నిజంగా విశేషమే. బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ సినిమా కంటే కూడా ఈ చిత్రానికే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సిమిమా ‘రాధేశ్యామ్’ కావడం విశేషం. ప్రస్తుతం మరో రెండు వారాలు వరకూ ఏ భారీ సినిమా రిలీజ్ కి లేకపోవడం ఈ సినిమాకు ఇంకా బాగా కలిసి రానుంది.
ఏది ఏమైనా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి… ఆ అంచనాలను చాలా తేలికగా అందుకుంది. సినిమాపై ఉన్న హైప్ ను చాలా ఈజీగా అందుకుంది. పైగా భారీ హైప్, సోలో రిలీజ్, విపరీతంగా చేసిన ప్రమోషన్లు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.
Also Read: Radhe Shyam Movie Release: ఆ విషయంలో భయపడి వెనక్కి తగ్గిన రాధేశ్యామ్.. అసలు కారణం ఇదే
గమనిక : అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ఇది.

[…] Ettara Jenda Song From RRR: క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చింది. అందులోని ‘ఎత్తర జెండా’ పాటను మార్చి 14న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ట్వీట్ చేసింది. రాంచరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ సంప్రదాయ వస్త్రాల్లో కనిపిస్తున్నారు. కాగా ఈ సాంగ్ అదిరిపోతోంది అని తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది. కొద్ది రోజుల్లో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. […]