https://oktelugu.com/

Vishnu : విష్ణు కు కూడా నోటీసులు పంపించిన రాచకొండ సీపీ…ముగ్గురికి గట్టి వార్నింగ్ ఇస్తారా..?

ఇక గత రెండు మూడు రోజుల నుంచి మోహన్ బాబు కి మంచు మనోజ్ కి మధ్య గొడవలైతే జరుగుతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2024 / 10:37 AM IST

    Vishnu

    Follow us on

    Vishnu : ఇక గత రెండు మూడు రోజుల నుంచి మోహన్ బాబు కి మంచు మనోజ్ కి మధ్య గొడవలైతే జరుగుతున్నాయి. మరి ఆ గొడవల్ని ఎవ్వరు ఆపుతారనుకుంటున్న సందర్భంలో మంచు విష్ణు నిన్న దుబాయ్ నుంచి వచ్చాడు… ఆయన తండ్రి కొడుకులు ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తాడు అనుకుంటే ఆ గొడవ తీవ్రతని ఆయన మరింత పెంచినవాడు అయ్యాడు…

    ఇక మోహన్ బాబుకి తన చిన్న కొడుకు అయిన మంచు మనోజ్ కి మధ్య గత రెండు రోజుల నుంచి గొడవలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక మోహన్ బాబు మనోజ్ మీద దాడి చేయించినట్టుగా ఆయన పోలీసులకు తెలియజేస్టి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఇక మోహన్ బాబు తన ఎలా టార్చర్ పెడుతున్నాడో తెలియజేస్తూ ఒక లేఖను కూడా రిలీజ్ చేశాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు మోహన్ బాబు పెద్ద కొడుకు అయిన విష్ణు దుబాయ్ నుంచి తిరిగి రావడంతో గొడవ సద్ధమనుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయన వచ్చి మనోజ్ ఇంటి మీదికి వెళ్లడం వాళ్ల బౌన్సర్లు తనని అడ్డుకోవడంతో గొడవ మరొక రూపంలో ముందుకు సాగిందనే చెప్పాలి. ఇక ఎట్టకేలకు మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లి తన బిడ్డను తెచ్చుకోవాలని అనుకున్నాడు. కానీ అతన్ని అక్కడ ఉన్న సిబ్బంది ఆపడంతో ఆయన షర్టు చినిగిపోయింది. ఆ చినిగిపోయిన షర్ట్ తోనే ఆయన లోపలికి వెళ్ళి తన బిడ్డను తెచ్చుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇక మొత్తానికైతే మంచి ఫ్యామిలీలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గు మనేలా ఉంది.

    ఇక దానికి తగ్గట్టుగానే మోహన్ బాబు మీడియా వ్యక్తుల మీద దాడి చేయడం దాని తర్వాత అయాన తీవ్రమైన అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరడం జరిగిపోయాయి. మొదట మనోజ్ కి మోహన్ బాబు కి రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు పంపించాడు. ఉదయం 10:30 నిమిషాలకు వాళ్లు కమిషనరేట్ కి వచ్చి హాజరవ్వాలని చెప్పాడట. ఇక ఇప్పుడు వీళ్ళతోపాటుగా మంచు విష్ణు కి కూడా నోటీసులు పంపించినట్టుగా తెలుస్తోంది.

    తను కూడా ఈ గొడవలో భాగమైనందువల్ల తనను కూడా పిలిచి విచారించి వీళ్ళ మధ్య కాంప్రమైజ్ చేయాలని పోలీసులు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు వింటారా? ఇక మోహన్ బాబు మనోజ్ విషయంలో కొంతవరకు బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్న నేపథ్యంలో లో పోలీసుల విచారణలో వాళ్ళు ఈ పాయింట్ ను లేవనెత్తితే మోహన్ బాబు వాళ్ల మాటలకు గౌరవం ఇస్తాడా?

    లేదంటే మీడియా వ్యక్తుల మీద కదా దాడి చేసినట్టు పోలీసుల మీద కూడా దాడి చేస్తాడా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా మంచు ఫ్యామిలీకి సినిమాల పరంగా కలిసి రావడం లేదని అనుకుంటున్న సందర్భంలో ఇలా గొడవలతో మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసుకుంటున్నారనే చెప్పాలి…