https://oktelugu.com/

Raavi Kondala Rao: ఆయన ట్రాక్ రికార్డ్  ఎన్టీఆర్, ఏఎన్నార్ లకి కూడా లేదు ! 

Raavi Kondala Rao: ఓ సాధారణ వ్యక్తి సినీ, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశేష అనుభవం సంపాదించి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని.. అసాధారణ వ్యక్తిగా నిలిచిపోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకే ఆ అరుదైన వ్యక్తిగా ‘శ్రీ రావి కొండలరావు గారు’ నిలిచిపోయారు. నాటకం.. సినీమా.. టీవీ.. పత్రికలు.. మిమిక్రీ ఇలా అన్ని రంగాలలోనూ నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఆయన విశేష సేవలు అందించారు. కళారంగాల్లో తిరుగులేని కళాకారుడిగా విశేష అనుభవం సంపాదించినప్పటికీ.. చివరి […]

Written By:
  • Shiva
  • , Updated On : February 26, 2022 / 12:45 PM IST
    Follow us on

    Raavi Kondala Rao: ఓ సాధారణ వ్యక్తి సినీ, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశేష అనుభవం సంపాదించి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని.. అసాధారణ వ్యక్తిగా నిలిచిపోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకే ఆ అరుదైన వ్యక్తిగా ‘శ్రీ రావి కొండలరావు గారు’ నిలిచిపోయారు. నాటకం.. సినీమా.. టీవీ.. పత్రికలు.. మిమిక్రీ ఇలా అన్ని రంగాలలోనూ నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఆయన విశేష సేవలు అందించారు.

    Raavi Kondala Rao

    కళారంగాల్లో తిరుగులేని కళాకారుడిగా విశేష అనుభవం సంపాదించినప్పటికీ.. చివరి వరకూ ‘రావి కొండలరావు’ నిరాడంబరంగానే తన జీవితాన్ని గడిపారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానం.. 600లకు పైగా సినిమాలలో నటించిన విలక్షణ నటనత్వం.. వందల నాటకాలు.. వందల సినిమాల రచనల్లో భాగం అయిన అనుభవం.. బహుశా ఈ ట్రాక్ రికార్డ్ మరొకరి ఎవ్వరికీ సాధ్యం కాకపోవచ్చు.

    Also Read:  రేపు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్

    పైగా ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్‌ గా పనిచేసిన అనుభవం.. అప్పట్లో ఆంధ్రపత్రికలో ఎన్నో కథలు, నాటకాలు రాసిన చరిత్ర ఒక్క ఆయనకు మాత్రమే దక్కింది. అసలు ‘సైలెన్స్.. సైలెన్స్… ఎవరా చెప్పింది’ అంటూ రావి కొండలరావు పూయించిన నవ్వులు ఎవరు మర్చిపోగలరు. అందుకే, తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన చేసిన అనేక రకాల కళా సేవలు శాశ్వతంగా ఉండిపోతాయి.

    Raavi Kondala Rao

    ముఖ్యంగా తెలుగు కథ, నాటకం గురించి గుర్తు చేసుకునే వారు ఉన్నంతకాలం రావి కొండలరావు ఎప్పటికీ జీవించే ఉంటారు. అసలు ‘రావి కొండలరావు’ లాంటి లెజెండరీ గురించి ఎంత చెప్పుకున్నా అక్షరాలకు అలుపు సొలుపు రాదు.

    ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో విశేషాలున్నాయి. అందుకే ఆయనను బహుముఖ ప్రజ్ఞాశాలి అని సినీ జనం మెచ్చుకుంటూ ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆ గొప్ప రచయిత, ఆ నిక్కచ్చమైన పాత్రికేయుడు, ఆ ప్రయోక్త ఇప్పుడు లేడు.

    అయితే, భారత తపాలా శాఖ వారు శ్రీ రావి కొండలరావు గారిపై ప్రత్యేక తపాలా చంద్రికను ఫిబ్రవరి 25 వ తారీఖున ఆవిష్కరిస్తున్నారు. ఇది తెలుగువారందరికి గర్వకారణం. దీనికి ఆయన పూర్తి అర్హుడు. కేవలం పది సంవత్సరాలలో 100 నాటికలు ఆకాశవాణి కోసం రాసిన ఏకైక రచయిత రావి కొండలరావు గారు మాత్రమే.

    Raavi Kondala Rao

    అన్నింటికీ మించి 127 చిత్రాలలో భార్యాభర్తలుగా నటించిన నిజమైన భార్య భర్తలు, నటులు శ్రీమతి రాధాకుమారిగారు – శ్రీ రావి కొండలరావు గారు. ఇది ప్రపంచ చలన చిత్ర రంగంలోనే ఒక అరుదైన రికార్డు. అప్పట్లో చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందించేవారు. వారిద్దరూ ఏ లోకంలో ఉన్నా సంతోషంగా కలిసే ఉండి ఉంటారు.

    Also Read: అక్కా, పవన్ బావ సినిమాకు వెళ్లాను’.. పూనమ్ కొత్త పోస్ట్

    Tags