Anirudh Ravichander: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ మైలురాయిగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను ఖాయం చేశారని చిత్ర బృందం నుంచి సమాచారం అందుతుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అనిరుధ్ అంటే సంగీతాభిమానులు చెవి కోసుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఫిబ్రవరి 7న ముహూర్తం ఉంటుందని తెలుస్తోంది.
నిజనికి అనిరుధ్ గతంలోనే ఎన్టీఆర్ సినిమాకు పని చేయాల్సింది. కానీ, కొన్ని కారణాల కారణంగా అప్పుడు ఈ కాంబినేషన్ మిస్ అయింది. ఎట్టకేలకు ఇప్పటికి ఈ కలయిక సెట్ అయింది. కారణం ఎన్టీఆర్ తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ చేయాలని ఎన్టీఆర్ పట్టుబట్టి అతనికి ఛాన్స్ ఇప్పించాడట. అన్నట్టు ఈ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని.. ఆ పాత్ర ఎన్టీఆర్ కి సవతి తల్లి పాత్ర అని సమాచారం.
Also Read: ‘అన్‌స్టాపబుల్’ సక్సెస్ కి కారణం ఆమె.. సుమన్ దాతృత్వ గుణం వైరల్ !
అయితే, ఆ పాత్రలో సీనియర్ హీరోయిన్ శోభన నటించబోతుందని టాక్ నడుస్తోంది. గతంలో ఇదే పాత్రలో విజయశాంతి నటిస్తోంది అని రూమర్ వినిపించింది. ఇప్పుడు శోభన పేరు వినిపిస్తోంది. అంతకు ముందు ఆ పాత్రలో ఒకప్పటి మరో స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ను తీసుకోవాలనుకున్నారు. మొత్తానికి ఈ పాత్ర పై అనేక పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.
అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కూడా సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్నాడు అన్నారు. కానీ ఈ వార్త ఫేక్. ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించే ఛాన్స్ ఉంది. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.
Also Read: టాలీవుడ్ జనవరి రివ్యూ : తొలి నెలలోని సినిమాలన్నీ విలవిల !