Homeఎంటర్టైన్మెంట్అందాల రాశిని వ‌రించిన‌ సుంద‌రాంగుడు ఎవ‌రో తెలుసా?

అందాల రాశిని వ‌రించిన‌ సుంద‌రాంగుడు ఎవ‌రో తెలుసా?

‘రాశీ..’ 90వ దశకంలో యువతకు నిద్ర లేకుండా చేసిన హీరోయిన్. ప్రతీ సినిమాలో ఆమె గుమ్మరించిన అందాల రాసులో తోడుకోలేక కుర్రకారుకు చెమటలు పట్టేవి. అయినప్పటికీ తనివి తీరని అంద‌గ‌త్తె అందాలను అలా.. చూస్తూ ఉండిపోయేవారు! అంత‌లా త‌న బ్యూటీతో మెస్మ‌రైజ్ చేసేది రాశి. Also Read: తన ఫోటోలు చూసి నిధి అగర్వాల్ షాక్ ! శుభాకాంక్ష‌లు, గోకులంలో సీత‌, పెళ్లి పందిరి, ప్రేయ‌సి రావే.. వంటి ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా […]

Raasi
‘రాశీ..’ 90వ దశకంలో యువతకు నిద్ర లేకుండా చేసిన హీరోయిన్. ప్రతీ సినిమాలో ఆమె గుమ్మరించిన అందాల రాసులో తోడుకోలేక కుర్రకారుకు చెమటలు పట్టేవి. అయినప్పటికీ తనివి తీరని అంద‌గ‌త్తె అందాలను అలా.. చూస్తూ ఉండిపోయేవారు! అంత‌లా త‌న బ్యూటీతో మెస్మ‌రైజ్ చేసేది రాశి.

Also Read: తన ఫోటోలు చూసి నిధి అగర్వాల్ షాక్ !

శుభాకాంక్ష‌లు, గోకులంలో సీత‌, పెళ్లి పందిరి, ప్రేయ‌సి రావే.. వంటి ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా స‌త్తా చాటారు రాశి. అయితే.. చాలా మందికి రాశి హీరోయిన్ గా మాత్ర‌మే తెలుసు. కానీ.. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ప్ర‌వేశించారు. 80వ ద‌శ‌కంలో ‘మమతల కోవెల’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. ఆ తర్వాత హిందీలో కూడా నటించింది. ఆ తర్వాత తెలుగులో 1997లో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘శుభాకాంక్షలు’ సినిమా ద్వారా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రాశి.

ఒక్కసారిగా ఫేమస్ అయిన రాశీ.. ఆ తర్వాత సౌత్ లోని పలు భాషల్లో సత్తా చాటింది. రాశి కాల్షీట్ల కోసం నిర్మాతలు వేచి ఉండేవారంటే అతిశయోక్తి కాదు. అందంతోపాటు అభినయంతోనూ ఆకర్షించే రాశిని చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యేవారు. అలా దాదాపు దశాబ్ద కాలం పాటు అలరించిన రాశీ.. సడన్ గా పెళ్లి చేసుకొని వెండి తెరకు దూరమయ్యారు.

అంతేకాదు.. ఆ తర్వాత చాలాకాలంపాటు ఎక్కడా కనిపించలేదు. చివరకు మీడియాకు కూడా దూరంగా ఉండిపోయారు రాశి. అయితే.. ఆమెది లవ్ మ్యారేజ్ అన్న విషయం చాలా మందికి తెలియదు. టాప్ హీరోయిన్ గా కొనసాగిన తర్వాత.. అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే.. ఆమెను వివాహమాడేందుకు వందల కోట్ల అధిపతులు ముందుకు వచ్చినప్పటికీ.. వారిని ఖాతరు చేయలేదు రాశి.

Also Read: ఎంట్రీతోనే దుమ్ములేపిన హీరోలు.. ఇందులో మీ స్టార్ ఉన్నారా?

ఒక అస్టిటెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నారు రాశి. ఆయన ఎవరో కాదు శ్రీముని. రాశి నటించిన పలు సినిమాలకు ఆయ‌న‌ సహాయక దర్శకుడిగా పని చేశారు. ఆ స‌మ‌యంలో మొద‌లైన‌ పరిచయంతో వారు మంచి స్నేహితులుగా మారారు. అయితే.. త‌న‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలోనే రాశి తండ్రి కాలం చేశారు. దీంతో.. శ్రీమునికి రాశి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు.

ఈ స‌మ‌యంలోనే త‌న‌ను పెళ్లి చేసుకుంటారా? అని తానే ముందుగా అడిగింద‌ట రాశి. దీనికి శ్రీముని కూడా ఓకే చెప్ప‌డంతో.. ఇద్దరు ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నార‌ట‌. తాజా ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు రాశి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper