
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించి, ఆ తర్వాత పవర్ స్టార్ గా తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ‘‘పవన్ కు అభిమానులు కాదు.. భక్తులు మాత్రమే ఉంటారు’’ అనే అభిప్రాయం కూడా ఉంది. ఆ స్థాయిలో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న పవన్.. రీల్ హీరోమాత్రమే కాదు.. రియల్ హీరో కూడా అనే అభిప్రాయం ఉంది. సాయం కోరి ఎవరు వచ్చినా.. సాయం చేసి పంపిస్తారనే పేరుంది.
ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొద్దో గొప్పో అందరికీ తెలిసినా.. లోతుపాతులు మాత్రం అందరికీ తెలియదు. 1995లో నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్న పవన్.. విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత 1996లో ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బద్రి సినిమాలో హీరోయిన్ గా చేసిన రేణు దేశాయ్ తో పరిచయం ప్రేమగా మారింది.
Also Read: ‘పూజా హెగ్డే’ డెత్ సీన్ హైలైట్ అట !
అయితే.. రేణు దేశాయ్ ఓ మోడల్. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే ఆమెను చూసి పూరి జగన్నాథ్ ‘బద్రి’ సినిమా లో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఆ విధంగా రేణు దేశాయ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అయితే.. చాలా మందికి తెలియని విషయం ఏమంటే.. రేణుదేశాయ్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా కొంత కాలం వర్క్ చేశారు.
Also Read: హాట్ బ్యూటీ షాకింగ్ నిర్ణయం !
బద్రి హిట్ తర్వాత పవన్ తో ప్రేమలో పడడంతో.. ఇద్దరూ కొన్ని సంవత్సరాలపాటు సహజీవనం చేశారు. కారణం ఇదేనేమోగానీ.. పవన్ తో తప్ప, వేరే హీరోతో సినిమా చేయలేదు రేణు. చాలా గ్యాప్ తర్వాత.. జానీ సినిమాలో, మళ్లీ పవన్ హీరోయిన్ గానే నటించింది. ఆ తర్వాత మొదటి భార్య నుంచి విడాకులు తీసుకొని, రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు పవన్.
అయితే.. వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి ఒకే ఒక్క విషయం కారణంగా చర్చల్లో నిలిచింది. రామ్ చరణ్ తో నాగబాబు ‘ఆరెంజ్’ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. కానీ.. సినిమా జనాలకు ఎక్కకపోవంతో ఆడలేదు. దీంతో.. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబు సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నారట. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకు డబ్బు సహాయం చేశాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం పవన్ – రేణు మధ్య విభేదాలు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
తన అన్నకు మాత్రమే కాకుండా.. అంతకు ముందు, ఆ తర్వాత కూడా చాలా మందికి డబ్బు సాయం చేశారనే వార్తలు మీడియాలో చాలానే వచ్చాయి. అయితే.. అవేకాకుండా అడిగిన వారెవరికైనా సాయం చేసేవారట పవన్. దీంతో.. ఇక మీదట ఎవరికీ డబ్బులు సహాయం చేయొద్దని చెప్పిందట రేణుదేశాయ్. అందరికీ ఇచ్చుకుంటూ పోతే చివరికి మనకేం మిగులుతుంది అనేదట. ఇదే విషయం పెరిగి పెద్దగా మారి, విడాకుల వరకూ దారి తీసిందని చెబుతుంటారు. అయితే.. పిల్లలు అఖీరా, ఆధ్యా బాగోగులు చూస్తూ పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటున్నప్పటికీ.. వాళ్ల బర్త్ డేలు, ఇతరత్రా ముఖ్యమైన అకేషన్స్ కి పవన్ హాజరవుతూనే ఉంటాడు.