Homeఎంటర్టైన్మెంట్Raasi Exclusive Interview 2026: ప్రభాస్ నన్ను అలా పిలిస్తే అసలు తట్టుకోలేను - హీరోయిన్...

Raasi Exclusive Interview 2026: ప్రభాస్ నన్ను అలా పిలిస్తే అసలు తట్టుకోలేను – హీరోయిన్ రాశి

Raasi Exclusive Interview 2026: మన టాలీవుడ్ లో సంసారపక్షమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు రాశి(Actress Raasi) . బాలనటిగా కెరీర్ ని ప్రారంభించిన ఈమె , అతి తక్కువ వయస్సులోనే స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి, పెద్ద స్టార్ హీరోయిన్ గా మారింది. కేవలం హీరోయిన్ ముఖాన్ని చూసి థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ సంఖ్య మన టాలీవుడ్ చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రాశీ. ఈమె కోరుకుంటే ఇప్పటికీ కూడా వరుసపెట్టి సినిమాలు చేయగలదు. కానీ ఎందుకో సినిమాల మీద ఈమె ప్రస్తుతానికి మక్కువ చూపించడం లేదు. ‘రంగస్థలం’ చిత్రం లో రంగమ్మత్త క్యారెక్టర్ మొదట్లో రాశి కి వచ్చింది. కానీ మోకాళ్ళు చూపించే సన్నివేశాలు ఉండడం తో , తన వల్ల కాదని చెప్పేసింది.

ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈమె ప్రభాస్(Rebel Star Prabhas) గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘మా సినీ నటులకు కొన్ని విషయాలు కచ్చితంగా తెలిసిపోతుంటాయి. ఒక నటుడుని లేదా నటిని చూసినప్పుడు, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పేయగలం. అలా ప్రభాస్ ని మొదటి సినిమా ‘ఈశ్వర్’ చూసినప్పుడే అనుకున్నాను, రాబోయే రోజుల్లో ఇతను పెద్ద సూపర్ స్టార్ అవుతాడని. నేను అనుకున్నదే జరిగింది. బాహుబలి సిరీస్ లో ఆయన నటన చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు ప్రభాస్ పక్కన నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను. హీరోయిన్ గా ఎలాగో కుదరదు, అది కలగానే మిగిలిపోతుంది. కానీ అక్కా, వదిన పాత్రలు చేయడానికైనా సిద్దమే కానీ, తల్లి పాత్ర మాత్రం పోషించను. ఎందుకంటే అతినికి , నాకు వయస్సులో అసలు తేడా లేదు’ అంటూ చెప్పుకొచ్చింది రాశి . అంతే కాదు ఈమె ప్రభాస్ హీరో గా నటించిన మిర్చి , రాధే శ్యామ్ చిత్రాల్లో , అతనికి తల్లి గా పోషించిన నటీమణులకు రాశీ డబ్బింగ్ కూడా చెప్పిందట. ఇలా రాశి డబ్బింగ్ కూడా చెప్తుంది అనే విషయం ఈ ఇంటర్వ్యూ ద్వారానే తెలిసింది. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియోలో చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper