Raasi Viral Video: ఈమధ్య కాలం లో శివాజీ(Actor Shivaji) హీరోయిన్స్ దుస్తులపై చేసిన కామెంట్స్, దాని చుట్టూ జరుగుతున్న సంఘటనలు సాధారణమైనవి కావు. అందరూ ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను దాదాపుగా మర్చిపోయారు. ఇప్పుడు శివాజీ కామెంట్స్ కి కౌంటర్లు ఇచ్చిన అన్వేష్ పై వ్యవహారం మొత్తం మరలింది. అతను శివాజీ పై నోరు జారడమే కాకుండా, ఏకంగా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఇతన్ని విదేశాల నుండి రప్పించి, అరెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం లో అన్వేష్(Naa Anveshana) తర్వాత బాగా పాపులర్ అయిన మరో సెలబ్రిటీ యాంకర్ అనసూయ(Anchor Anasuya). ఈమె శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తూ, సోషల్ మీడియా లో విడుదల చేసిన కొన్ని వీడియోలు ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
వాటికి నెటిజెన్స్ కౌంటర్లు ఇస్తూ , గతం లో జబర్దస్త్ మరియు ఇతర కామెడీ షోస్ లో అనసూయ మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగా వైరల్ అయ్యాయి. అందులో అనసూయ ఒక స్కిట్ లో ‘రాశి గారి ఫలాలు’ అని అంటుంది. అందుకు హైపర్ ఆది కౌంటర్ ఇస్తూ ‘అది రాశి గారి ఫలాలు కాదు. రాశిఫలాలు’ అని అంటాడు. అందుకు ఆ షో కి జడ్జీ గా వ్యవహరిస్తున్న రోజా పగలబడి నవ్వుతుంది. ఈ వీడియో బాగా వైరల్ అవ్వడం, అది హీరోయిన్ రాశి(Heroine Raasi) వరకు వెళ్లడం జరిగింది. దీనికి రాశి కౌంటర్ ఇస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘ఒక అమ్మాయి అయ్యుండి రాశి గారి ఫలాలు గురించి మాట్లాడుతున్నావా అని అనసూయ అంటుంది. అసలు ఆ అమ్మాయికి ఎలా అనాలని అనిపించింది?’.
‘రాశి ఫలాలు లో నేను లేను, కానీ రాశి గారి ఫలాలు లో నేను ఉన్నాను. ఆమె మాట్లాడింది నా గురించే. అంతలా మాట్లాడితే ఆ ఎపిసోడ్ లో కూర్చున్న మరో ఆమె(రోజా) ‘హాహా’ అని నవ్వుతుంది. నేనే ఆ స్థానం లో ఉండుంటే, స్కిట్ ని మధ్యలో ఆపేసి ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం ఏంటి?. కామెడీ చేయొచ్చు కానీ, ఒక అమ్మాయిని ఇలా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడం ఏమి కామెడీ?’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అందుకు సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. హీరోయిన్ రాశి సాధారణంగా చాలా సైలెంట్ గా తన పనులు తానూ చేసుకుంటూ వెళ్లే అమ్మాయి. ఏ రోజు కూడా ఇలా తీవ్ర స్థాయిలో స్పందించిన దాఖలాలు లేవు, అలాంటి ఆమెకు ఇంతలా కోపం రావడం అనేది చిన్న విషయం కాదు.