
Rashi Khanna: రాశి ఖన్నా హ్యాపీ మూడ్లో ఉన్నారు. లేటెస్ట్ రిలీజ్ ఫార్జీ హిట్ టాక్ తెచ్చుకుంది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఫార్జీ సూపర్ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ కొనియాడుతున్నారు. షాహిద్ కపూర్,విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేసిన ఈ క్రైమ్ సిరీస్లో రాశి ఖన్నా కీలక రోల్ చేశారు. దొంగ నోట్లు పసిగట్టంలో ఎక్స్పర్ట్ అయిన ఆర్బీఐ ఎంప్లాయ్ గా రాశి ఖన్నా నటించారు. ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ రూపొందించారు.

క్రైమ్, కామెడీ, ఇన్వెస్టిగేషన్ డ్రామాతో కూడిన ఫార్జీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎనిమిది ఎపిసోడ్ల ఫార్జీ సిరీస్ ఫిబ్రవరి 10 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఫార్జీ సక్సెస్ తో బాలీవుడ్ లో ఆఫర్స్ తలుపుతడతాయని రాశి నమ్ముతున్నారు. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా దిశా పటాని మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు.

టాలీవుడ్ లో రాశి కథ ముగిసినట్లే. ప్రస్తుతం ఒక్క తెలుగు చిత్రానికి కూడా ఆమె సైన్ చేయలేదు. గత ఏడాది రాశి నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ ఒకదాన్ని మించిన మరొక డిజాస్టర్ గా నిలిచాయి. ఆ దెబ్బతో రాశి ఖన్నాను మేకర్స్ పక్కన పెట్టేశారు. 2019 రాశికి బాగా కలిసొచ్చింది. వెంకీ మామ, ప్రతిరోజూ పండుగే వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి.
అయితే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో రాశి ఖన్నా శృంగార సన్నివేశాల్లో నటించారు. బోల్డ్ క్యారెక్టర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రాశి ఖన్నాకు ఆఫర్స్ రాలేదు.

ఆ టైం లో రాశి వరుసగా తమిళ చిత్రాలు చేశారు. ఇక కార్తీకి జంటగా ఆమె నటించిన సర్దార్ హిట్ టాక్ తెచ్చుకుంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ రూ. 80 కోట్ల గ్రాస్ రాబట్టింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కూడా విజయం సాధించింది. ప్రస్తుతం రాశి తన దృష్టి బాలీవుడ్ పై పెట్టారు. ఈ ఏడాది రాశి ఖన్నాకు మంచి ఆరంభం లభించగా… మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.